పూరి కేరాఫ్ గోవా

దర్శకుడు పూరి జగన్నాధ్ అంటే గుర్తుకువచ్చేది బ్యాంకాక్. ఇలా బ్యాంకాక్ వెళ్లి, అలా ఓవారం గడిపి, ఫుల్ స్క్రిప్ట్ తో వెనక్కురావడం అన్నది ఆయనకు అలవాటు. బ్యాంకాక్ లో ఆయన హైదరాబాద్ లో తిరిగినంత…

దర్శకుడు పూరి జగన్నాధ్ అంటే గుర్తుకువచ్చేది బ్యాంకాక్. ఇలా బ్యాంకాక్ వెళ్లి, అలా ఓవారం గడిపి, ఫుల్ స్క్రిప్ట్ తో వెనక్కురావడం అన్నది ఆయనకు అలవాటు. బ్యాంకాక్ లో ఆయన హైదరాబాద్ లో తిరిగినంత ఈజీగా తిరిగేస్తారు. అక్కడ జనాలకు కూడా ఆయన పక్కాలోకల్ అన్నంత పరిచయం. అయితే ఈ మధ్య ఆయన బ్యాంకాక్ తగ్గించేసారు. సరైన హిట్ లు కూడా పడలేదు.

అలాంటి టైమ్ లో ఇస్మార్ట్ శంకర్ అనే గట్టి హిట్ కొట్టారు. దాంతో ఇప్పుడు యంగ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నారు. ఆ స్క్రిప్ట్ రెడీ చేయడం కోసం పూరి జగన్నాధ్ మళ్లీ సూట్ కేస్ సర్దేసుకున్నారు. అయితే బ్యాంకాక్ కు కాదు, జస్ట్ గోవాకు మాత్రమే. పూరికి బ్యాంకాక్ తరువాత అంత ఇష్టమైన ప్లేస్ గోవా. ఆయన సినిమాలు చాలా వరకు గోవాలో ఒకటో రెండో సీన్లు కానీ, పాటలు కానీ షూట్ చేసుకున్నవే.

అందుకే ఈసారి ఆయన గోవా వెళ్తున్నారు. వెళ్లి ఓవారం పదిరోజులు వుండి, బౌండ్ స్క్రిప్ట్ బరువుతో తిరిగి వస్తారు. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్న విజయ్, ఆ తరువాత హీరో సినిమాను ఫినిష్ చేసి, పూరి జగన్నాధ్ సినిమా దగ్గరకు వస్తారు. ఈ సినిమా మళ్లీ సమ్మర్ కు విడుదలవుతుంది.

గ్రేట్ ఆంధ్ర ఈవారం స్పెషల్ బిగ్ స్టోరీ