‘పుష్ప’పై అంచనాలు పెంచుతున్నారు

దర్శకుడు సుకుమార్ టీమ్, ఆయన శిష్యుల టీమ్ వేరు వేరు కాదు. పైగా ఉప్పెన సినిమా నిర్మాతలు, పుష్ప సినిమా నిర్మాతలు ఒక్కరే. దీనివల్ల ఉప్పెన ప్రమోషన్లలో పుష్ప ప్రస్తావని కచ్చితంగా వస్తోంది.  Advertisement…

దర్శకుడు సుకుమార్ టీమ్, ఆయన శిష్యుల టీమ్ వేరు వేరు కాదు. పైగా ఉప్పెన సినిమా నిర్మాతలు, పుష్ప సినిమా నిర్మాతలు ఒక్కరే. దీనివల్ల ఉప్పెన ప్రమోషన్లలో పుష్ప ప్రస్తావని కచ్చితంగా వస్తోంది. 

దర్శకుడు బుచ్చిబాబు అయినా, నిర్మాతలు లేదా సుకుమార్, ఆఖరికి సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ ఇలా ఎవరు మాట్లాడినా ఎక్కడో ఓ చోట పుష్ప ప్రస్తావన వస్తోంది.

పుష్ప సినిమా కోసం సుకుమార్ ఎంత చేస్తున్నాడో చెబుతున్నారు. దేవీశ్రీప్రసాద్ ఓ సంగతి చెప్పారు.  ఓ కొండ మీదకు అయిదు వందల మందిని తీసుకెళ్లడానికి దారి చేసినట్లు, రోప్ కేమేరా వంటి టెక్నాలజీ వాడారని చెప్పారు. 

అసలు ఆ సీన్ ను విజువలైజ్ చేసుకుని చూసుకుంటే ఓ రేంజ్ లో వుంటుందన్నారు. పుష్ప సినిమాతో కొత్త సుకుమార్ ను చూస్తారని నిర్మాతలు అంటున్నారు. అసలు పుష్ప సినిమా ఓ రేంజ్ లో వుంటుందని చెబుతున్నారు. 

అసలు ఇలాంటి సినిమా సుకుమార్ నుంచి వస్తుందని ఊహించడమే కష్టం అని అంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ పుష్ప సినిమా గురించి కలవరిస్తూ, సినిమా రేంజ్ ను తమకు తెలియకుండానే పెంచుతున్నట్లుంది.

‘ఉప్పెన’ మన నేటివ్‌ కథ

వెన్నుపోటు అనే పదానికి పేటెంట్ హక్కు చంద్రబాబుదే