Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఫుష్ప పార్ట్ 2 కి యాభై కోట్లు

ఫుష్ప పార్ట్ 2 కి యాభై కోట్లు

బన్నీ-సుకుమార్ కాంబినేషన్ తో తయారవుతున్న సినిమా పుష్ప. ఈ సినిమా తొలి భాగానికి నిర్మాత మైత్రీ మూవీస్ తో పాటు సమర్పకులుగా బన్నీ మిత్రులు వున్నారు. 

బన్నీ అలవాటు ప్రకారం అడ్వాన్స్ లేకుండా సినిమా చేస్తారు. దానికి బదులుగా కొంత ప్రాఫిట్ షేర్ ఆ మిత్రులకు ఇస్తారు. గతంలో నా పేరు సూర్య సినిమాకు ఇలాగే నాగబాబుకు లాభాల్లో వాటా అందించారు.

అయితే ఇప్పుడు పుష్ప రెండో భాగానికి మాత్రం ఈ వ్యవహారం లేదని తెలుస్తోంది. సాలిడ్ గా యాభై కోట్ల రెమ్యూనిరేషన్ బన్నీకి ఇవ్వడానికే ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. 

మొదటి భాగానికి మాత్రం యాభై కోట్లు తీసుకోలేదు. లాభాల్లో వాటా వుండడం వల్ల తగ్గించి తీసుకున్నారని బోగట్టా.

కానీ రెండో భాగానికి మాత్రం అలా చేయకుండా మిగిలిన టాప్ హీరోల మాదిరిగా బన్నీ కూడా యాభై కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?