Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

క్వాన్ చుట్టుూ నీలినీడలు?

క్వాన్ చుట్టుూ  నీలినీడలు?

క్వాన్ సెలబ్రిటీ మేనేజ్ మెంట్ సంస్థకు చాలా పేరు వుంది. అదే సంస్ధ సౌత్ కోసం ప్రత్యేకంగా క్వాన్ సౌత్ అంటూ మరో సంస్థను ప్రారంభించింది. దీంట్లో దగ్గుబాటి రానా సగం వాటాదారుడు అని తెలుస్తోంది. టాప్ హీరోయిన్లు అంతా క్వాన్ తో ఒప్పందాల్లోనే వున్నారు. అటు ముంబాయిలో అయినా, ఇటు ఆంధ్రలో అయినా. ఈ క్వాన్ కు వ్యవస్థాపకుల్లో ఒకరు మన ఆర్జీవీ దగ్గర బంధువు మధు మంతెన.

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పుడు వినిపిస్తున్న పేర్లు చాలా వాటికి దాదాపుగా క్వాన్ తో సంబంధాలు వుండడం విశేషం. క్వాన్ అధినేతలో, అధికారులో, దాంతో ఒప్పందాలు వున్న హీరోయిన్లో ఇలా అన్నమాట. టాలీవుడ్ లో సెలబ్రిటీలకు రాజకీయ నేతలతో, అధికార వర్గాలతో, పోలీసు బాస్ లతో, ఇంకా చాలా చాలా వాళ్లతో మంచి సంబంధాలు వుంటాయి. అవన్నీ ఎవరి కోసం వారు వాడుకోవడం, ఎవరి గేమ్ వారు ప్లాన్ చేయడం తప్ప, వెన్నుపోట్ల వ్యవహారాలు తక్కువ. 

కానీ బాలీవుడ్ అలా కాదు. తెర మీద కన్నా తెరవెనుక అనేక కుట్రలు, కుతంత్రాలు ఇలా చాలా అంటే చాలా వుంటాయి. అవన్నీ తారాస్థాయికి చేరిపోయి, ఆఖరికి సుశాంత్ సింగ్ మరణానికి ఆఫై ఈ డ్రగ్స్ వ్యవహారానికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. మహరాష్ట్ర లో అధికారంలో వున్న శివసేనకు, కేంద్రంలోని భాజపాకు మధ్య వైరం కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభావితం చేస్తోందేమో అన్న అనుమానాలు కూడా వున్నాయి. 

ఏమైనా ఎక్కడ ఏం జరిగినా మన తెలుగువాడి ప్రమేయం పాజిటివ్ గానో, నెగిటివ్ గానో వుండకుండా అయితే వుండదు. మనవాళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఎదగడంతో ఇలాంటి పరిణామం అనివార్యమైందేమో?

బాబు వందల గుళ్లు కూల్చేసినా ఓకేనా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?