Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాశీ ఖన్నా.. ఈ సినిమాలే తేల్చేస్తాయ్!

 రాశీ ఖన్నా.. ఈ సినిమాలే తేల్చేస్తాయ్!

తనకు బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నట్టుగా చెబుతోంది రాశీ ఖన్నా. ప్రస్తుతానికి ఈ భామకు దక్షిణాదిన అవకాశాలు బాగా తగ్గుముఖం పట్టిన పరిస్థితి అగుపిస్తోంది. అతి త్వరలోనే రాశీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. వాటి తర్వాత ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులు కనిపించడం లేదు!

'వెంకీ మామ' 'ప్రతి రోజూ పండగే' ఈ రెండు సినిమాలూ విడదలకు రెడీ అయ్యాయి. ఇక 'వరల్డ్ ఫేమస్ లవర్' లో కూడా రాశీ నటిస్తోందట. ఈ మూడు తెలుగు సినిమాలే ప్రస్తుతానికి రాశీ ఖాతాలో కనిపిస్తున్నాయి. ఒక తమిళ సినిమాకు కూడా ఈమె సైన్ చేసినా.. ఆ ప్రాజెక్టు డిలే అవుతోంది.

ఇలాంటి నేపథ్యలో మూడు తెలుగు సినిమాల్లో ఏ రెండు హిట్ అయినా రాశీ కెరీర్ కు ఇబ్బంది లేకపోవవచ్చు. హిట్స్ వస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. తేడా కొట్టినప్పుడే పరిస్థితి మారుతుంది.

ప్రస్తుతానికి అయితే రాశీకి సౌత్ లో అవకాశాలు మందగించిన పరిస్థితి కనిపిస్తోంది. తనకు బాలీవుడ్ లో ఆదరణ ఉందని ఈమె అంటోంది. నటిగా రాశీ ఖన్నా ఎంట్రీ బాలీవుడ్ ద్వారానే జరిగింది. ఆ తర్వాత హిందీ లో చేసిన సినిమాలు పెద్దగా లేవు కానీ, తెలుగు-తమిళాల్లో మాత్రం బిజీబిజీగా కొనసాగిందీమె.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?