Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాజమౌళి తొందర.. బయ్యర్లు ససేమీరా!

రాజమౌళి తొందర.. బయ్యర్లు ససేమీరా!

‘ఆర్.ఆర్.ఆర్’ మరీ డిలే అయిపోవడంతో రాజమౌళిపై ఇప్పుడు విపరీతమైన ఒత్తిడి వుంది. ఈ చిత్రాన్ని ఎలాగయినా ఈ ఏడాదిలో విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు. 

అయితే వేసవిలో కానీ, కాస్త ఆలస్యంగా ఆగస్ట్‌లో కానీ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. దాంతో దసరా రిలీజ్‌పై రాజమౌళి దృష్టి పెట్టాడు.

ట్రేడ్‌లో కూడా దసరాకి ట్రిపులార్ వస్తుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే ఆర్.ఆర్.ఆర్. బయ్యర్లు మాత్రం దసరా రిలీజ్ పట్ల సుముఖంగా లేరు. 

ఇంత భారీ చిత్రానికి దసరా ఏమాత్రం కరక్ట్ సీజన్ కాదని వారు అనుకుంటున్నారు. సంక్రాంతి లేదా సమ్మర్‌లో తప్ప ఈ చిత్రం ఎప్పుడు వచ్చినా కానీ ఆ రేట్లకు వర్కవుట్ కాదనేది వారి ఫీలింగ్. 

రాజమౌళి మాత్రం ఇంకా ఈ సినిమా రిలీజ్ డేట్ పట్ల ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేడు. ఇప్పటికే రెండుసార్లు డేట్ మార్చారు కనుక ఈసారి పక్కాగా డేట్ ఖరారు చేయాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్‌ని బట్టి మిగతా పెద్ద సినిమాల ప్లానింగ్ ఆధారపడి వుంది కనుక త్వరలోనే రాజమౌళి ఒక నిర్ణయానికి రాక తప్పదు.  

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?

దర్శకుడిగా మారుతున్న రవితేజ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?