రాక్షసుడు తొలివారం ఓకె

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కోనేరు సత్యనారాయణ నిర్మించిన రాక్షసుడు సినిమా థియేటర్లలో దిగ్విజయంగా వన్ వీక్ పూర్తి చేసుకుంది. తొలివారం మంచి వసూళ్లే సాధించింది. తొలివారమే బ్రేక్ ఈవెన్ అయిపోయేంత లేదు కానీ, యాభై…

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కోనేరు సత్యనారాయణ నిర్మించిన రాక్షసుడు సినిమా థియేటర్లలో దిగ్విజయంగా వన్ వీక్ పూర్తి చేసుకుంది. తొలివారం మంచి వసూళ్లే సాధించింది. తొలివారమే బ్రేక్ ఈవెన్ అయిపోయేంత లేదు కానీ, యాభై నుంచి అరవైశాతం రికవరీ సాధించింది. కొన్నిచోట్ల అంతకన్నా ఎక్కువే సాధించింది. మలివారం మార్కెట్ లో పోటీ వున్నా, వరుసగా నాలుగైదు రోజులు సెలవులు రావడంతో మంచి కలెక్షన్లు వుంటాయని, దాంతో బ్రేక్ ఈవెన్ కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.

బెల్లంకొండ సరసన అనపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమాను తమిళ సినిమా ఆధారంగా రీమేక్ చేసారు థ్రిల్లర్ జోనర్ అయిన రాక్షసుడు సినిమాను తెలుగునాట కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు. అందుకే డబుల్ స్క్రీన్ లు తీసేయగా దాదాపు విడుదలయిన అన్నిచోట్లా సినిమాను సెకెండ్ వీక్ కూడా వుంచారు.

తొలివారం వసూళ్లు ఇలా వున్నాయి.
నైజాం…….3.20 కోట్లు
సీడెడ్………1.10
ఉత్తరాంధ్ర..1.12
ఈస్ట్…………0.60
వెస్ట్………….0.45
కృష్ణ…………0.60
గుంటూరు…..0.61
నెల్లూరు……..0.25