Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రకుల్‌కి స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌

రకుల్‌కి స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌

నాగ చైతన్యతో రొమాన్స్‌ చేసే వయసులో వుండి నాగార్జునతో జంట కట్టిందంటే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చాలా పెద్ద రిస్క్‌ చేసినట్టే. చేసిన పాత్ర కంటే ఎవరితో చేసిందనేదే ఎక్కువ పట్టించుకునే ఇండస్ట్రీలో నాగార్జునలాంటి అరవయ్యేళ్ల హీరోతో నటిస్తే ఇక ముప్పయ్‌లలో వున్న హీరోలు ఎలా ఛాన్స్‌ ఇస్తారు. ఇదంతా తెలిసినా కానీ రాహుల్‌ రవీంద్రన్‌ చెప్పిన కథ నచ్చడంతో 'మన్మథుడు 2' ఓకే చేసేసింది రకుల్‌.

ఈ చిత్రానికి ఆమె ఖచ్చితంగా టాకింగ్‌ పాయింట్‌ అనేది తెలిసినా కానీ టీజర్‌లో తనకి చోటు ఇవ్వలేదు. కనీసం రకుల్‌ నీడ కూడా చూపించకుండా టీజర్‌ ముగించేయడం ఫాన్స్‌కి నచ్చలేదు. అయితే రకుల్‌ని టీజర్‌లో కొన్ని క్షణాలు చూపిస్తే ఆమెకి జస్టిఫికేషన్‌ జరగదని, అందుకే ఆమె కోసం ప్రత్యేకంగా ఒక టీజర్‌ కట్‌ చేస్తున్నామని రాహుల్‌ చెప్పాడు.

గతంలో రంగస్థలం చిత్రానికి ఫస్ట్‌ రిలీజ్‌ చేసిన టీజర్‌లో సమంతని చూపించలేదు. వెంకటలక్ష్మిని పరిచయం చేయడానికి ప్రత్యేకించి టీజర్‌ రిలీజ్‌ చేసారు. అలాగే మన్మథుడి 'అవంతిక'కి కూడా స్పెషల్‌ టీజర్‌తోనే ఇంట్రడక్షన్‌ జరుగుతుందట. కాకపోతే దీనికోసం అభిమానులు మరో మూడువారాలు వేచిచూడక తప్పదట. 

ఓటమిపాలైనా తుదిశ్వాస దాకా రాజకీయాల్లోనే - పవన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?