Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రామ్ చరణ్ ను కామెడీ చేసేసిన బోయపాటి!

రామ్ చరణ్ ను కామెడీ చేసేసిన బోయపాటి!

సోషల్ మీడియాలో అన్నివేళలా కొన్ని సినీ స్టంట్స్ వైరల్ గా ఉంటాయి. పరమ సిల్లీగా ఉండే ఆ స్టంట్స్ వీడియోలు యూట్యూబ్ లో వైరల్ అవుతూ ఉంటాయి. ఏ సందర్భం వచ్చిన నెటిజన్లు వాటిని ఉపయోగించుకొంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు. కేవలం ఒక భాషకు పరిమితం కాదు ఇలాంటి వైరల్ వీడియోస్. ఏదైనా ఒక్క భాషలో ట్రోల్ మొదలైందంటే.. అది అన్ని భాషల జనాలకూ అల్లుకొంటూ ఉంటుంది.

ఇప్పటివరకూ అర్థం లైని ఫైట్స్, కామెడీ ఫైట్స్ విషయంలో బాలయ్యే ఉదాహరణగా ఉండేవాడు. పక్క రాష్ట్రాల వారు కూడా ఈ విషయంలో తెలుగు వారిని గేలి చేసేవాళ్లు. తొడ కొట్టి రైలును వెనక్కు పంపడం, వేలు ఊపి కుర్చీని రప్పించుకోవడం.. నోటితో బుల్లెట్ ఊదడం.. గట్రా ఫైట్స్, యాక్షన్ సీన్స్ ను ప్రస్తావిస్తూ తమిళోళ్లు ఇతర భాషల వాళ్లు తెలుగు వాళ్లను వెక్కిరించే వాళ్లు.

వాళ్ల సినిమాల్లో బోలెడన్ని బొక్కలున్నా.. బాలయ్య ఫైట్స్ ను మాత్రం వెక్కిరింతకు వాడేవాళ్లు. అలాగే విజయ్ కాంత్ ఫైట్స్ కూడా ఈ రకమైనా కామెడీని జనరేట్ చేస్తూ ఉన్నాయి. అలా కామెడీ యాక్షన్ సీన్స్ విషయంలో విజయ్ కాంత్, బాలయ్యల సరసన జాయిన్ అయ్యాడు రామ్ చరణ్ కూడా.

చరణ్ ను ఆ క్లబ్ లోకి కలిపిన ఘనత కచ్చితంగా బోయపాటిదే. వినయ విధేయ రామలోని యాక్షన్ ఎపిసోడ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమా థియేటర్లో ఆ యాక్షన్ సీన్స్ ను తమ సెల్ ఫోన్లలో తీసి.. వెబ్ లో పోస్టు చేస్తున్నారు ప్రేక్షకులు.

ఇంతలా నవ్వించే యాక్షన్ ఎపిసోడ్లు గత దశాబ్దకాలంగా తెలుగు సినిమా తెరపై చూడలేదు... అనేది బాగా వినిపిస్తున్న మాట. దమ్ము వంటి సినిమాలో ఎన్టీఆర్ తో బోయపాటి తెరనిండా రక్తం చిందింపజేశాడు. నరకడం అప్పుడు కూడా కామెడీనే అయ్యింది. ఇప్పుడు కల్ట్ కామెడీ అవుతోంది. అదే తేడా!

తనయుడు చనిపోయినా షూటింగ్‌ పూర్తి చేసిన ఎన్టీఆర్‌

పబ్లిక్ పల్స్: వినయ విధేయ రామ ఎలా ఉందంటే?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?