Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దీపిక బిల్డింగ్ లో రెంటుకు ఉంటున్న ర‌ణ్ వీర్!

దీపిక బిల్డింగ్ లో రెంటుకు ఉంటున్న ర‌ణ్ వీర్!

సినిమా వాళ్ల బంధాలు బ‌య‌టి జ‌నాల‌కు అంత తేలిక‌గా అర్థం కావు. సినిమా వాళ్లిద్ద‌రు ఎవ‌రైనా పెళ్లి చేసుకున్న‌ప్ప‌టికీ వారి ఖాతాలు మాత్రం అలాగే వ్య‌క్తిగ‌తంగా ఉండిపోతాయ‌ని ద‌శాబ్దాల నుంచినే ప్రేక్ష‌కులు అనుకుంటూ ఉంటారు. భ‌ర్త న‌ష్టాల‌తో భార్య‌కు సంబంధం ఉండ‌దు, భార్య సంపాద‌న‌పై భ‌ర్త‌కు హ‌క్కు ఉండ‌ద‌ని అంటారు. అయితే కొంద‌రు హీరోయిన్ల సంపాద‌న‌ను భ‌ర్త‌లే హార‌తి క‌ర్పూరాలు చేశార‌ని అంటారు.

వారి సంగ‌తులేమో కానీ.. బాలీవుడ్ దంప‌తులు దీపికా, ర‌ణ్ వీర్ సింగ్ ల గురించి ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన ప్ర‌చారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీపిక సొంత ఫ్లాట్ ను క‌లిగి ఉన్న అపార్ట్ మెంట్ లోనే ర‌ణ్ వీర్ సింగ్ మ‌రో ఫ్లాట్ లో రెంటుకు ఉన్న‌ట్టుగా బాలీవుడ్ మీడియా చెబుతోంది. ప్ర‌తి నెలా 7.25 ల‌క్ష‌ల రూపాయ‌ల రెంట్ ను ఇచ్చి మ‌రీ రెంట్ కు ఉంటున్నాడ‌ట ర‌ణ్ వీర్ సింగ్. ముంబైలోని అత్యంత ఖ‌రీదైన ఆ ప్రాంతంలో చాలా సంవ‌త్స‌రాల కింద‌టే దీపికా ప‌దుకునే సొంతంగా ఒక ఫ్లాట్ ను కొనుగోలు చేసింది. 

ప‌దేళ్ల కింద‌టే ఏకంగా 16 కోట్ల రూపాయ‌లు వెచ్చింది ఆమె అక్క‌డ ఫ్లాట్ ను కొనుగోలు చేసింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అదే అపార్ట్ మెంట్ లో కొన్నేళ్లుగా రెంట్ కు ఉంటున్నాడ‌ట ర‌ణ్ వీర్. వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిన‌ప్ప‌టి నుంచి ర‌ణ్ వీర్ అక్క‌డ రెంట్ కు ఫ్లాట్ ను మెయింటెయిన్ చేస్తున్నాడ‌ని అంటున్నారు. అయితే వీరి పెళ్లి అయిన త‌ర్వాత కూడా ర‌ణ్ వీర్ రెంటెడ్ ఫ్లాట్ కొన‌సాగుతూ ఉంద‌ని అక్క‌డి మీడియా చెబుతోంది. ఇలా భార్య‌కు సొంత ఫ్లాట్ ఉన్న అపార్ట్ మెంట్ లో భ‌ర్త అద్దె ఫ్లాట్ ను కొన‌సాగిస్తూ ఉండ‌టం విశేషం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?