cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ర‌ష్మిక రెమ్యూనిరేష‌న్ ను పెంచేసింది!

ర‌ష్మిక రెమ్యూనిరేష‌న్ ను పెంచేసింది!

ఒక‌వైపు బాలీవుడ్ అవ‌కాశాలు, మ‌రోవైపు సౌత్ లో ఉన్న డిమాండ్ దృష్ట్యా రెమ్యూనిరేష‌న్ ను భారీగా పెంచే ప్ర‌య‌త్నంలో ఉంద‌ట ర‌ష్మిక‌. నాలుగేళ్ల కింద‌ట క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిమిత‌మై, పెళ్లి చేసుకుని సెటిల‌య్యే ప్ర‌య‌త్నం చేసిన ర‌ష్మిక‌.. తెలుగులో ద‌క్కిన సినిమా విజ‌యాల‌తో కెరీర్ ప్లానింగ్ ను మార్చేసుకుంది. ఎంగేజ్ మెంట్ ను ర‌ద్దు చేసుకుని సినిమాల‌తో ఫుల్ బిజీ అయిపోయింది. 

దానికి త‌గ్గ‌ట్టుగా స్టార్ హీరోల‌తో అవ‌కాశాలు, భారీ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. తెలుగుతో పాటు త‌మిళంలోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇంకోవైపు బాలీవుడ్ ఛాన్సులు. ఇలా ఫుల్ జోష్ మీదున్న ర‌ష్మిక‌.. ఇప్పుడు త‌న రెమ్యూనిరేష‌న్ ను మూడు కోట్ల రూపాయ‌ల స్థాయిలో ఫిక్స్ చేస్తోంద‌ని వినికిడి.

ఇన్నాళ్లూ ర‌ష్మిక కోటి రూపాయ‌ల స్థాయిలో ఒక్కో సినిమాకు తీసుకుంద‌ని, ఇప్పుడు త‌న మార్కెట్ రేంజ్ పెరిగింది కాబ‌ట్టి.. మినిమం మూడు కోట్ల రూపాయ‌లు అంటూ ర‌ష్మిక కొత్త రేటును ఫిక్స్ చేసింద‌ని టాక్. ర‌ష్మిక పేరుతోనే ఇప్ప‌టికే ప‌లు సినిమాలు మార్కెట్ అయ్యాయి.

ఈమె తెలుగులో పాపుల‌ర్ అయ్యాకా.. క‌న్న‌డ నుంచి ఈమె న‌టించిన సినిమాల‌ను వ‌ర‌స పెట్టి డ‌బ్ చేశారు. ర‌ష్మిక న‌టించ‌డంతో హిందీ, త‌మిళ సినిమాలకు కూడా తెలుగు, క‌న్న‌డ అనువాద ఛాన్సులు కాస్త పెరుగుతాయి. ఇలాంటి నేప‌థ్యంలో.. మూడు కోట్ల రూపాయ‌ల రెమ్యూనిరేష‌న్ ను ఫిక్స్ చేసిన‌ట్టుగా ఉంది. మిగ‌తా హీరోయిన్ల లాగానే దీపముండ‌గానే ఇళ్లు చ‌క్క‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుంది.

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు