Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రవితేజ తో అప్సర రాణి

రవితేజ తో అప్సర రాణి

అప్పర రాణి అంటే ఇటీవల సోషల్ మీడియాను తన ఫొటోలతో ఊపు ఊపేసిన నటి. ఆర్జీవీ సినిమాలో ఆరబోసిన అందాల కన్నా, ఆ సినిమా ప్రమోషన్ కోసం విడుదల చేసిన ఫోటోల్లో ఆరబోసింది ఎక్కువ. ఆ అందాల ప్రదర్శన చూసే జనాలు ఫిక్స్ అయ్యారు తెలుగు సినిమాలకు ఓ ఐటమ్ గర్ల్ దొరికేసిందని.

ఇప్పుడు అదే నిజమయ్యింది. రవితేజ తో టాగోర్ మధు నిర్మిస్తున్న క్రాక్ సినిమాలో అప్సర రాణి ఒక ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ హాట్ హాట్ సాంగ్ ను అన్నపూర్ణలో పిక్చరైజ్ చేస్తున్నారు. 

వల్గారిటీకి తక్కువ, హాట్ కు ఎక్కువ లాంటి డ్రెస్ లతో అప్సర రాణి పాటలో కనిపించబోతోంది. థమన్ అందించిన మాంచి గీతాన్ని ఓ భారీ సెట్ లో చిత్రీకరిస్తున్నారు. వాస్తవానికి ఈ పాటను ముందు వదిలేద్దాం అనుకున్నారు.

ఓటిటికి ఇచ్చేస్తున్నాం కదా, ఐటమ్ సాంగ్ అవసరం లేదులే అనుకున్నారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకుని సంక్రాంతి బరిలో దించుతున్నారు కనుక ఐటమ్ సాంగ్ యాడ్ చేసారు. 

వైయస్సార్ దగ్గర చంద్రబాబు డబ్బులు తీసుకునేవాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?