అనసూయ, అమరావతి, అవును, అంటూ ఇలా అ..అక్షరం మీదే టైటిళ్లు ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నాడు యాక్టర్ కమ్ డైరక్టర్ రవిబాబు. మధ్యలో అక్షరం మార్చి చేసిన లడ్డూబాబు కాస్తా బాక్సాఫీస్ దగ్గర ఢమాల్ మనడమే కాకుండా, రవిబాబు కెరీర్ బాగా వెనక్కు నెట్టేసింది.
ఆ తరువాత రవిబాబు కూడా ఏదో ఓ ఆస్ట్రేలియా పందిపిల్లను తెచ్చి, దాన్ని సానబడ్డి, అదిగో సినిమా అంటూ ఎప్పటి నుంచో ఊరిస్తున్నాడు. ఆఖరికి ఇప్పటికి అదిగో సినిమా అక్టోబర్ లో విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సినిమాతో మళ్లీ రవిబాబు తన సెంటిమెంట్ అ అక్షరం మీదకు మళ్లీరావడం మాత్రమేకాదు. తన సినిమాల్లో తప్పనిసరిగా వుంటుందని టాలీవుడ్ లో పేరు పడిపోయిన నటి పూర్ణను కూడా తీసుకున్నాడు.
పందిపిల్ల సినిమాలో అయిటమ్ సాంగ్ చొప్పించి, అక్కడ పూర్ణను తీసుకున్నాడు. పూర్ణ గ్లామర్ హీరోయిన్ కాదు, గ్లామర్ ఫేస్ కాదు. పైగా అన్నింటికి మించి ఆమె నటించిన సినిమాల్లో ఒకటో రెండో మినహా మిగిలినవి అన్నీ డిజాస్టర్లే. అయినా రవిబాబు ఆమెను అయిటమ్ సాంగ్ కు తీసుకోవడం అంటే, ఆయన తన సెంటిమెంట్ ను ఎంతలా నమ్ముకున్నాడో అర్థం అవుతోంది.
మొత్తంమీద పందిపిల్లకు సెంటిమెంట్లు అద్ది రవిబాబు హిట్ కొట్టి మళ్లీ ట్రాక్ మీదకు వస్తాడేమో చూడాలి.