Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈ టైటిల్స్‌ పెడితే.. జనాలొస్తారా రవితేజా?

ఈ టైటిల్స్‌ పెడితే.. జనాలొస్తారా రవితేజా?

‘రాజా దిగ్రేట్’, ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్’... ఇదీ పరంపర. ఎనర్జిటిక్ హీరో రవితేజ .. వరసగా ఈ టైటిల్స్ తో దండయాత్రలు చేస్తూ ఉన్నాడు. ఇవి మాస్ జనాలకు ఎక్కే టైటిల్సే కావొచ్చు. మాస్ మహరాజా.. అనిపించుకుంటున్న హీరోకి.. ఈ టైటిల్స్ నచ్చితే నచ్చవచ్చు.

అయితే.. మాస్ ఆడియన్స్ ను పక్కన పెడితే.. మిగతా వాళ్లు ఏ మాత్రం ఆసక్తి చూపే టైటిల్స్ కావు ఇవి. ఒక సినిమా హిట్ కావాలంటే.. ఏదో ఒక సెక్షన్ జనాలు ఇష్టపడితే కాదు కదా. అందరూ దానివైపు చూస్తేనే.. ఆ సినిమా బయట పడే పరిస్థితి ఉంటుంది.

అయితే.. రవితేజ టైటిల్స్ మాత్రం ఫ్యామిలీ జనాలను భయపెట్టేస్తూ ఉన్నాయి. టచ్ చేసి చూడు.. పై ఈ ప్రభావం గట్టిగానే కనిపించింది. ఫ్యామిలీ.. ఆడియన్స్ ఆ టైటిల్ వినే.. ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల వైపుకు రాలేదు. దానికితోడు ఆ సినిమాకు వచ్చిన డివైడ్ టాక్.. దారుణంగా దెబ్బేసింది.

రాజా ది గ్రేట్.. టైటిల్ లో కూడా మాస్ అప్పీరియన్స్ ఎక్కువైంది. అప్పుడు.. మళ్లీ ‘నేల టికెట్’ అంట. ఈ టైటిల్ విని.. ఎంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా ఆడే థియేటర్ల వైపు వస్తారు? అనేది వేరే చెప్పనక్కర్లేదు. ఎంత మాస్ మహరాజా అయితే మాత్రం.. ఫ్యామిలీ ఆడియన్స్ ను టైటిల్ తోనే హడలుగొట్టేయడం ఏమిటో. అసలే వరస ఫెయిల్యూర్లు.. ఆ పై ఇలాంటి టైటిళ్లు.. ఇలా అయితే ఎలా మాస్ మహరాజా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?