cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రెండు ఫేస్ ల హీరో ?

రెండు ఫేస్ ల హీరో ?

సినిమా రంగంలో చాలా మందికి రెండు ఫేస్ లు వుంటాయి. ఆన్ ది స్క్రీన్ కన్నా ఆఫ్ ది స్క్రీన్ ఎక్కువగా నటించేస్తుంటారు. డైరక్టర్ లు ఎవరు పలకరించినా, ఓ సినిమా చేద్దాం మనం, మంచి స్క్రిప్ట్ వుంటే చూడండి అంటూ ఓ రుమాలు వేసి వుంచుతారు. అదే గ్యాసిప్ గా వచ్చిన తరువాత ఎవరైనా అడిగితే 'అబ్బే ఆయనతో మనమెందుకు చేస్తాం' అని అంటారు.

ఇటీవల ఓ మంచి డైరక్టర్ పేరు, ఓ యంగ్ హీరోతో కలిసి తెగవినిపించింది. ఈ మధ్యనే ఓ మిడిల్ హీరోతో బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఆ డైరక్టర్. తరువాత ఏంటీ అన్నపుడు, ఫలానా హీరో అంటూ గ్యాసిప్ లు మొదలయ్యాయి. ఆ హీరో వరుసగా ఫ్లాపులు చూసి, ఆఖరికి ఓ హిట్ కొట్టారు. అందువల్ల ఈ కాంబినేషన్ చాలా క్రేజ్ గా వుంటుందని  అనుకున్నారు మీడియాలో ఆ గ్యాసిప్ చదివినవారు.

కానీ ఈ హీరో ఓ ప్రొడ్యూసర్ కు ఎదురుపడితే, 'ఏంటి తరువాత ఆ డైరక్టర్ తోనే అంటగా' అని అడిగాడట. దానికి ఆ హీరో..మనమా....అబ్బే..అబ్బే..అబ్బే..అని భుజాలు జర్క్ చేసి కదిలి వెళ్లిపోయాడట. నిజానికి ఆ హీరో ఆ డైరక్టర్ దగ్గర మనం ఒక సినిమా చేయాలనే అంటున్నాడు ఎప్పటి నుంచో. మరి అది నిజమో? ఇది యాక్టింగ్ నో? లేదా ఇది నిజమో? లేక యాక్టింగ్ లో ఆ యంగ్ హీరో కే తెలియాలి.

ఇప్ప‌టికీ శ్రీదేవితో చేసిన డాన్స్ లే గుర్తొస్తున్నాయి