Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రేణుదేశాయ్ 18 ఏళ్ల తరువాత

రేణుదేశాయ్ 18 ఏళ్ల తరువాత

ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ సినిమాలు మానేసినా అప్పుడప్పుడు టీవీ షో ల్లో కనిపిస్తూనే వున్నారు. ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తారు అని టాక్ వినిస్తూనే వుంది కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఆమె ఒక వెబ్ సిరీస్ కోసం మళ్లీ మొహానికి మేకప్ వేసుకుని కెమేరా ముందుకు వస్తున్నారు. ఈ విషయాన్ని రేణు నే అధికారికంగా ప్రకటించారు.

''..మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నానని, ఓ వెబ్‌ సిరీస్‌ లో నటించేందుకు అంగీకరించానని చెప్పడానికి సంతోషంగానూ, అలాగే ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను...'' అని ఆమె ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం అవుతుంది.  ఈ వెబ్‌ సిరీస్‌కు నిర్మాతలు డిఎస్‌. రావు, ఎస్‌. రజినీకాంత్‌. సాయి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎమ్‌.ఆర్‌. కృష్ణ మామిడాల అంటూ మరిన్ని వివరాలు అందించారు. 

రేణు దేశాయ్ నటిస్తానని అనాలే కానీ తెలుగు సినిమాల్లో మిడిల్ ఏజ్డ్ పాత్రల రూపంలో మంచి అవకాశాలే రావడానికి ఆస్కారం వుంది. నదియా, మీనా, టబు, సంగీత ఇలా సీనియర్ హీరోయిన్లు అంతా తెరపైకి మళ్లీ వచ్చారు. వారితో పోల్చుకుంటే రేణు వయసు చాలా తక్కువే.

జగన్ గారి గురించి భయంగా ఉంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?