ఆర్జీవీకి పృధ్వీతో పనేంటీ?

థర్టీ ఇయర్స్ పృధ్వీ ఇటీవల కాస్త వెనకబడ్డారు. రాజకీయాల్లో బిజీ కావడం వల్ల కావచ్చు. వైకాపాలో వుండడం వల్ల కావచ్చు, మొత్తం మీద సినిమాలు కాస్త తగ్గాయి. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ సినిమాల…

థర్టీ ఇయర్స్ పృధ్వీ ఇటీవల కాస్త వెనకబడ్డారు. రాజకీయాల్లో బిజీ కావడం వల్ల కావచ్చు. వైకాపాలో వుండడం వల్ల కావచ్చు, మొత్తం మీద సినిమాలు కాస్త తగ్గాయి. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ సినిమాల మీద దృష్టిపెడుతున్నట్లు కనిపిస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో ఇటీవల దర్శకుడు ఆర్జీవీ చకచకా ఏటిటి/ఓటిటి సినిమాలు చేస్తున్నారు. పైగా అయితే బూతు సినిమా లేదా అంటే సంచలన సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇవి అయితేనే ఆన్ లైన్ లో జనం ఎగబడి చూస్తారు.

ఇలాంటి నేపథ్యంలో ఆయన నటుడు పృధ్వీని పిలిచి స్క్రీన్ టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. స్క్రీన్ టెస్ట్ చేయాల్సినంత పాత్ర ఏమిటి? పృధ్వీతో ఆర్జీవీ ఏం చేయబోతున్నారు అన్నది తెలియాల్సి వుంది. ఆర్జీవీ మదిలో చాలా సినిమాలు ప్లానింగ్ లో వున్నాయి.

హైదరాబాద్ దాదాస్ అంటూ పాతబస్తీ, నిన్నటి తరం రౌడీల మీద సినిమాలు చేయబోతున్నారని తెలుస్తోంది. 

మొత్తానికి ఆర్జీవీ సినిమాతో పృధ్వీ మళ్లీ టాలీవుడ్ లో హల్ చల్ ప్రారంభిస్తారేమో?

సిక్స్ ప్యాక్ లో నాగ శౌర్య