Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆర్ఆర్ఆర్ షూట్ మళ్లీ ఆగింది!

ఆర్ఆర్ఆర్ షూట్ మళ్లీ ఆగింది!

నిరంతర ధారావాహిక మాదిరిగా సాగుతోంది ఆర్ఆర్ఆర్ షూటింగ్. కరోనా ముందే సినిమా ఆలస్యం అయింది. కరోనా తో మరింత ఆలస్యం అయింది. 2020 సమ్మర్ కు అనుకున్నది 2021 సంక్రాంతికి వెళ్లి, అక్కడ నుంచి ఇంక ఎప్పుడు విడుదల అన్నది పెద్ద ప్రశ్నగా మారిపోయింది.

ఇలాంటి నేపథ్యంలో మళ్లీ షూటింగ్ ప్రారంభించాం అంటూ హడావుడి చేసారు. దానికి ఓ విడియో కూడా వదిలారు. అయితే కొమరం భీమ్ పాత్రధారి ఎన్టీఆర్ కు సంబంధించిన టీజర్ ఈ నెల మూడో వారంలో విడుదల చేయాల్సి వుంది. దాని చిత్రీకరణ కోసం తప్పని సరై షూట్ చేయాల్సిన పరిస్థితి వుంది. అందుకోసం తిరగి షూట్ ప్రారంభించారు. 

ఆపైన మళ్లీ బ్రేక్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మళ్లీ షూటింగ్ ప్రారంభించినా హీరోలు ఇధ్దరు మాత్రం సెట్ కు రారని తెలుస్తోంది. దీంతో అసలు ఆర్ఆర్ఆర్ 2021 సమ్మర్ లేదా పోస్ట్ సమ్మర్ కు రెడీ కాగలదా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.

ఇంతేనా వ్యూస్?

ఇదిలా వుంటే ఆర్ఆర్ఆర్ లాంటి క్రేజీయెస్ట్ ప్రాజెక్టుకు సంబంధించి అప్ డేట్ అన్నట్లుగా, ఇద్దరు హీరోల లాంగ్ షాట్ లుక్ తో చిన్న విడియో కట్ చేసి వదిల్తే దానికి యూ ట్యూబ్ లోపెద్దగా ఆదరణ రాకపోవడం ఆశ్చర్యం.

గట్టిగా రెండు మిలియన్ల వ్యూస్ రాలేదు. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఉద్దండుల సినిమా విడియోకి ఈపాటి వ్యూస్ అంటే కాస్త ఆశ్చర్యమే.  ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ మీద జనం దృష్టి పెట్టడం తగ్గుతోందా అన్న అనుమానాలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?