Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సైరా Vs సాహో.. అక్కడ కూడా పోటీ తప్పలేదు

సైరా Vs సాహో.. అక్కడ కూడా పోటీ తప్పలేదు

చిరంజీవి నటిస్తున్న సైరా కారణంగా ఇప్పటికే తన సినిమా సాహోను కాస్త పక్కకు జరిపాడు ప్రభాస్. సైరా సినిమాను వేసవి చివర్లో విడుదలకు సిద్ధం చేయడంతో, సాహోను ఆగస్ట్ 15కు వాయిదావేశారు. ఇప్పుడు మరో విషయంలో కూడా సాహోకు పోటీగా నిలిచింది సైరా. అదే శాటిలైట్ రైట్స్. 

అవును.. శాటిలైట్ హక్కుల్లో కూడా సాహోకు తలనొప్పిగా మారింది సైరా. ఎందుకంటే దాదాపు ఈ రెండు సినిమాలకు ఒకటే రేటు చెబుతున్నారు. అలాంటప్పుడు ప్రభాస్ సినిమా బదులు చిరంజీవి సినిమానే కొనుక్కుంటాం కదా అనే ప్రశ్న సాహో యూనిట్ కు ఎదురవుతోంది. ఇది మేకర్స్ కు ఇబ్బందికరంగా మారుతోంది. 

సాహో సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ను 25-30 కోట్ల మధ్య అమ్మాలని చూస్తున్నారు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు. అటు సైరా సినిమాకు కూడా దాదాపు ఇదే రేటు చెబుతున్నాడు నిర్మాత రామ్ చరణ్. దీంతో ఎక్కువమంది టీవీ ఛానెల్ వాళ్లు సాహో కంటే సైరా వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. 

సైరా సినిమాకు సంబంధించి ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ డీల్ పూర్తయింది. ఈ నెలాఖరుకు ఈ సినిమాకు సంబంధించి మైసూల్ ప్యాలెస్ లో ఓ కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఆలోగా శాటిలైట్ డీల్ లాక్ చేయాలనేది రామ్ చరణ్ ఆలోచన. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?