మెగాస్టార్ మెగామూవీ సైరా ట్రయిలర్ టైమ్ దగ్గరకు వచ్చేసింది. మరో 24 గంటలు. మెగాభిమానులు తెలుగు రాష్ట్రాల్లో ట్రయిలర్ ను వీక్షించడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే టైమ్ అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. ప్రస్తుతానికి తాత్కాలికంగా హైదరాబాద్ తో సహా పలు పెద్ద పట్టణాల్లో అనేక థియేటర్లను సాయంత్రం అయిదు నుంచి ఆరు మధ్యలో బ్లాక్ చేసి వుంచారు.
కంటెంట్ రెడీ, క్యూబ్ అవైలబులిటీ అన్నీ చూసుకుని ట్రయిలర్ విడుదల చేస్తారు. ట్రయిలర్ ను ఆయా థియేటర్లలో ఉచితంగా ప్రదర్శిస్తారు. బాహబలి ప్రభాస్ సాహోకి కూడా ఇలాగే చేసారు. సాహో ట్రయిలర్ థియేటర్ ల్లో వేసాక, ఆ సినిమాకు మాంచి బజ్ వచ్చింది. అందుకే ఇప్పుడు అదేబాటలో వెళ్లాలని సైరా కూడా డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.
సైరా మీద మెగాభిమానుల్లో ఇప్పటికే మాంచి ఆశలు వున్నాయి. ట్రయిలర్ బయటకు వస్తే, మెగాభిమానులే కాదు, సినిమా అభిమానులు కూడా అక్టోబర్ 2 కోసం ఎదురుచూడడం ప్రారంభమవుతుంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి ఇలా చాలామంది హేమా హేమీలు సైరాలో నటించారు.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై హీరో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించారు.