cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

45 హోట‌ళ్లు బుక్.. మాజీ ప్రియురాలి పెళ్లికి స‌ల్మాన్!

45 హోట‌ళ్లు బుక్.. మాజీ ప్రియురాలి పెళ్లికి స‌ల్మాన్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రినా కైఫ్, బాలీవుడ్ న‌టుడు విక్కీ కౌశ‌ల్ ల వివాహానికి ఏర్పాట్లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే నెల రెండో వారంలో వీరి పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌ని అన‌ధికారికంగా వార్త‌లు వ‌స్తున్నాయి. వాటిపై వీరు పెద‌వి విప్ప‌డం లేదు. అయితే వ‌చ్చే నెల ఏడు, ఎనిమిది, తొమ్మిది తేదీల్లో  రాజ‌స్తాన్ లోని ర‌ణ‌తంబోర్ లో వీరి పెళ్లి కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్న‌ట్టుగా స‌మాచారం. ఈ క్ర‌మంలో అక్క‌డ త‌మ పెళ్లికి ఈ జంట భారీ స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసుకుంటోంద‌ట‌.

త‌మ పెళ్లి వేడుక‌కు హాజ‌ర‌య్యే సెల‌బ్రిటీలు, ప్ర‌ముఖుల కోసం ఈ జంట భారీ స్థాయిలో హోట‌ళ్ల‌ను బుక్ చేసింద‌ట‌. ఏకంగా 45 హోట‌ళ్ల‌ను వీరు బుక్ చేశార‌నే మాట వినిపిస్తోంది! ఆ ఊర్లో పెద్ద పెద్ద హోట‌ళ్లు లేవ‌ట‌. దీంతో అందుబాటులో ఉన్న మెరుగైన 45 హోటళ్ల‌ను వీరు త‌మ పెళ్లి అతిథుల కోసం బుక్ చేసిన‌ట్టుగా స‌మాచారం. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు అతిర‌థులు హాజ‌ర‌వుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

వీరిలో బాలీవుడ్ బిగ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడ‌ట‌. క‌త్రినా, విక్కీలు స‌ల్మాన్ ను కూడా ఆహ్వానించార‌ని, త‌న మాజీ ప్రియురాలు అయిన క‌త్రినా పెళ్లికి స‌ల్మాన్ ఖాన్ హాజ‌రు కావొచ్చ‌ని తెలుస్తోంది. బ్రేక‌ప్ త‌ర్వాత కూడా క‌త్రినాతో ప‌లు సినిమాల్లో న‌టించాడు స‌ల్మాన్. వీరు ఎడ‌మొహం పెడ‌మొహంగా లేరు. ఈ క్ర‌మంలో క‌త్రినా పెళ్లికి కూడా స‌ల్మాన్ ఖాన్ హాజ‌రు కావొచ్చ‌ని తెలుస్తోంది.

ఇక క‌త్రినా మ‌రో మాజీ ప్రియుడు కు ఆహ్వానం అందిందా లేదా అనేది కూడా ఇక్క‌డ చ‌ర్చ‌నీయాంశంగా నిలిచే అవ‌కాశం ఉంది. అత‌డే ర‌ణ్ భీర్ క‌పూర్. బ్రేక‌ప్ త‌ర్వాత కూడా వీరు ఒక సినిమాను పూర్తి చేశారు. ఈ నేప‌థ్యంలో గ‌తాన్ని ప‌క్క‌న పెట్టి బాలీవుడ్ స‌హ‌చారుడిగా ర‌ణ్ భీర్ ఈ వివాహానికి వ‌స్తే... ఇద్ద‌రు మాజీ ప్రియుల స‌మ‌క్షంలో క‌త్రినా పెళ్లి జ‌రిగిన‌ట్టు అవుతుంది.

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు