Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స‌మంత‌కు ఆ ఆస‌క్తే లేదా!

స‌మంత‌కు ఆ ఆస‌క్తే లేదా!

బాలీవుడ్.. చాలా మంది హీరోయిన్ల‌ల క‌ల‌ల పంట‌! సౌత్ లో హీరోయిన్ గా గుర్తింపుకు నోచుకున్న వాళ్లు అనేక మంది బాలీవుడ్ త‌లుపు త‌ట్ట‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు.భారీ పారితోష‌కాలు,క‌ల‌ర్ ఫుల్ ముంబై లైఫ్.. ఇవ‌న్నీ బాలీవుడ్ అవ‌కాశాల‌తోనే హీరోయిన్ల‌కు సాధ్యం అవుతాయి.

బాలీవుడ్ లో ప్ర‌ముఖ హీరోయిన్లు అందుకునే పారితోష‌కాలు.. ద‌క్షిణాదిన స్టార్ హీరోలు తీసుకునే రెమ్యూన‌రేష‌న్ల‌కు దాదాపు స‌రిస‌మానంగా ఉంటాయి. అందుకే బాలీవుడ్ అంటే హీరోయిన్ల‌కు క్రేజ్.

సౌత్ లో వెలిగిన త‌మ‌న్నా వంటి వాళ్లు కూడా బాలీవుడ్ కు వెళ్లి తాము ఉత్త‌రాది వాళ్లమే అని, బాలీవుడ్ త‌న‌బోటి వాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ఓపెన్ గా చెప్పుకున్నారు. స‌గ‌టు హీరోయిన్లు బాలీవుడ్ అవ‌కాశం అంటే ఎగిరి గంతేసే ప‌రిస్థితుల్లో కొంత‌మంది సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ ప‌ట్ల ఏ మాత్రం ఆస‌క్తి చూపించ‌డం లేదు.

అనుష్కా షెట్టి, న‌య‌న‌తార వంటి వాళ్లు సౌత్ లో త‌మ స్టార్ డ‌మ్ ను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బాలీవుడ్ వైపు చూడటం లేదు. స‌మంత కూడా ఇదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తూ ఉంది. ఈమె కూడా బాలీవుడ్ కు స్ట్రిక్ట్ గా నో చెబుతున్న‌ట్టుగా తెలుస్తోంది.

క‌న్న‌డ‌లో సూప‌ర్ హిట్ అయిన సినిమా 'యూట‌ర్న్'. దాన్ని తెలుగులో స‌మంత రీమేక్ చేసింది. యావ‌రేజ్ గా ఆడింది తెలుగు వెర్ష‌న్. ఇప్పుడు ఆ సినిమానే హిందీలో రీమేక్ చేస్తున్నార‌ట‌. అందులో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించాల‌ని ఒరిజిన‌ల్ వెర్ష‌న్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్, స‌మంత‌నే కోరాడ‌ట‌. అయితే అందుకు ఈ హీరోయిన్ నో చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే ఆస‌క్తి లేద‌ని ఈమె తేల్చి చెప్పింద‌ట‌. ఈ నేప‌థ్యంలో ఆ అవ‌కాశం తాప్సీకి ద‌క్క‌బోతోంద‌ని స‌మాచారం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?