Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగ్ చెబితే సమంత సంతకం చేసింది..?

నాగ్ చెబితే సమంత సంతకం చేసింది..?

పెళ్లి తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తానని చెప్పింది. కానీ ఇంత స్పీడ్ పెంచుతుందని మాత్రం జనాలు ఊహించలేదు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమంత ఇప్పుడు మరో మూవీకి సైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా మామ నాగార్జున చెబితే ఒప్పుకుందట.

ఈనెల 24న నాగ్-నాని కాంబోలో మల్టీస్టారర్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో నాగ్ సరసన కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా నటించనుందనే విషయం తెలిసిందే. ఇప్పుడు నాని సరసన హీరోయిన్ గా సమంతను తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. ఈ మేరకు నాగార్జున ద్వారా ఓ మాట చెప్పించాడట నిర్మాత అశ్వనీదత్. వెంటనే సమంత ఒప్పుకుందట.

నాని, సమంత కాంబోలో ఇప్పటికే ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలొచ్చాయి. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి మరోసారి నటించబోతున్నారన్నమాట. అయితే తాజా చిత్రంలో సమంతది ఫుల్ లెంగ్త్ రోల్ కాదని తెలుస్తోంది. కేవలం 15 రోజుల కాల్షీట్లు ఇస్తే పనైపోతుందట. అందుకే సమంత ఒప్పుకుందనే టాక్ కూడా వినిపిస్తోంది.

ప్రస్తుతం సమంత చేతిలో రంగస్థలం, మహానటి సినిమాలున్నాయి. వీటిలో రంగస్థలం షూటింగ్ కంప్లీట్ అయింది. అటు తమిళనాట కూడా ఆమె 2 సినిమాలు చేస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?