Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సందీప్ రెడ్డి.. అనిమ‌ల్, స్పిరిట్ రెండూ ఒక‌టేనా? వేరా?

సందీప్ రెడ్డి..  అనిమ‌ల్, స్పిరిట్ రెండూ ఒక‌టేనా?  వేరా?

ఒక‌వైపు హిందీలో అనిమ‌ల్ మూవీని అనౌన్స్ చేసి ఉన్నాడు దర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డితో సంచ‌ల‌నం సృష్టించిన ఈ ద‌ర్శ‌కుడు ఆ త‌ర్వాత ఆ సినిమాను హిందీ లో రీమేక్ చేసి అదే స్థాయి హిట్ కొట్టాడు. ఈ క్ర‌మంలో బాలీవుడ్ దృష్టి ఈ ద‌ర్శ‌కుడి మీద ప‌డింది. 

క‌బీర్ సింగ్ సూప‌ర్ హిట్ అయిన త‌ర్వాత ర‌ణ్ బీర్ క‌పూర్ తో సందీప్ సినిమా అనౌన్స్ మెంట్ వ‌చ్చింది. అనిమ‌ల్ పేరుతో ఆ సినిమాను అనౌన్స్ చేశారు కానీ, ఇప్ప‌టి వ‌ర‌కూ షూటింగ్ ప‌ట్టాలెక్కిన దాఖ‌లాలు లేవు. 

ర‌ణ్ బీర్ క‌పూర్ వేర్వేరు సినిమాల‌తో బిజీగా ఉండ‌టం, క‌రోనా ప‌రిస్థితులు.. వంటి కార‌ణాలు ఉండ‌వ‌చ్చు. అయితే తాజాగా ఆ సినిమా గురించి కొంత క్లారిటీ వ‌చ్చింది. అనిమ‌ల్ సినిమా షూటింగ్ కు వ‌చ్చే ఏడాది డేట్లు కేటాయించాడ‌ట ర‌ణ్ బీర్. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో ఆ సినిమా షూటింగ్ ప‌ట్టాలెక్కుతుంద‌ని స‌మాచారం. 2022 ఏప్రిల్ నుంచి ఆ సినిమా కు ర‌ణ్ బీర్ ప‌ని చేస్తాడ‌ట‌. వ‌ర‌స‌గా ఆరు నెల‌ల పాటు ఆ సినిమా షూటింగ్ కే కేటాయిస్తాడ‌ట‌. 

అక్టోబ‌ర్ నాటికి ఆ సినిమాకు సంబంధించి త‌న వ‌ర్క్ ను పూర్తి చేస్తాడ‌ట ర‌ణ్ బీర్. ముందుగా అనుకున్న‌ది అయితే వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ కు ఆ సినిమా విడుదల కావాల్సింది. అయితే అప్ప‌టికి షూటింగ్ పూర్త‌య్యే అవ‌కాశాలున్న‌ట్టున్నాయి ప్ర‌స్తుతానికి.

ఇక ఇంత‌లో ఆ ద‌ర్శ‌కుడి నుంచి మ‌రో సినిమా అనౌన్స్ మెంట్ వ‌చ్చింది. ఇది కూడా భారీ పిక్చ‌రే. ప్ర‌భాస్ హీరోగా స్పిరిట్ పేరుతో సందీప్ కొత్త సినిమాను ప్ర‌క‌టించాడు. ప్ర‌భాస్ కూడా వివిధ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. మ‌రి ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో క్లారిటీ రావాల్సి ఉంది.

మ‌రో విశేషం ఏమిటంటే.. ఈ రెండు సినిమాల ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఒక‌టే! టీ సీరిస్ వారు అనిమ‌ల్ కు ప్రొడ్యూస‌ర్లు. సందీప్ రెడ్డి సొంత నిర్మాణ సంస్థ కూడా భాగ‌స్వామి. ఇప్పుడు ప్ర‌భాస్ తో ఈ ద‌ర్శ‌కుడి సినిమాకు కూడా టీ-సీరిస్ కూడా నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఇదంతా చూస్తుంటే.. వ‌చ్చే డౌట్.. అనిమ‌ల్ సినిమా క‌థే ప్ర‌భాస్ తో స్పిరిట్ గా వ‌స్తోందా? అనేది! హిందీ వెర్ష‌న్ లో ర‌ణ్ బీర్, తెలుగు వెర్ష‌న్ ప్ర‌భాసా? అనే డౌట్ రావొచ్చు. అయితే ప్ర‌భాస్ తో తీసినా హిందీలో వ‌ర్క‌వుట్ అయ్యే అవ‌కాశాలు ఇప్పుడు పుష్క‌లంగా ఉన్న నేప‌థ్యంలో.. రెండూ వేర్వేరు క‌థ‌లే అయ్యే అవ‌కాశాలూ ఉన్నాయి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?