Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ చిన్న హీరోయిన్ కు అంత భారీ ఆస్తులా!

ఆ చిన్న హీరోయిన్ కు అంత భారీ ఆస్తులా!

సంజ‌నా గ‌ల్రానీ.. తెలుగులో చాలా కాలం కింద‌ట న‌టించింది. ఆ త‌ర్వాత అడ‌పాద‌డ‌పా ఆమెకు అవ‌కాశాలు ద‌క్కాయి. క‌న్న‌డ‌లో మాత్రం బిజీగానే సాగింది ఆమె కెరీర్. కానీ క‌న్న‌డ సినిమాల్లో హీరోయిన్ల‌కు ఇచ్చే పారితోష‌కాలు చాలా చాలా త‌క్కువ‌. 

తెలుగులో బుజ్జిగాడు వంటి సినిమాలో న‌టించిన ఆమె, మ‌ధ్య‌లో చిన్న సినిమాలు పోనూ.. ఆ మ‌ధ్య స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ లో నటించిన‌ట్టుగా ఉంది.  అది కూడా చిన్న పాత్ర‌లో. సంజ‌న కెరీర్ ఇలా సాగిన‌ప్ప‌టికీ ఆమెకు ఆస్తులు మాత్రం భారీగా ఉన్నాయ‌ని గుర్తించార‌ట పోలీసులు. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో ఆమె అరెస్టైన సంగ‌తి తెలిసిందే. ఆమె విచార‌ణ సంద‌ర్భంగా సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయ‌ట‌. త‌న‌కు బెంగ‌ళూరు ప‌రిధిలో భారీగా ఆస్తులున్న‌ట్టుగా సంజ‌న చెప్పుకొచ్చింద‌ట‌. ప‌దికి పైగా ఫ్లాట్లే ఉన్నాయ‌ని వివ‌రించింద‌ట‌.

హీరోయిన్ గా ఆమె స్టార్ కాదు. త‌క్కువ సినిమాలు, చిన్న సినిమాల్లోనే న‌టించింది. అయినా అన్ని ఆస్తులు ఎలా వ‌చ్చాయని ఆమెను పోలీసులు ప్ర‌శ్నిస్తున్నార‌ట‌. సంజ‌న డ్ర‌గ్స్ బిజినెస్ లో డ‌బ్బులు సంపాదించింద‌నే కోణంలో వారు ప్ర‌శ్నిస్తున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది.

సంజ‌న‌కు క‌ర్ణాట‌క‌లోని హై క్లాస్ పీపుల్ తో సంబంధాలున్నాయ‌ని.. డ్ర‌గ్స్ రాకెట్ లో ఆమె తో పాటు కన్న‌డ చిత్ర సీమ‌కు చెందిన ప్ర‌ముఖుల‌కు,  సెల‌బ్రిటీల‌కు సంబంధాలున్నాయ‌నే టాక్ వినిపిస్తూ ఉంది. మ‌రి వారంద‌రినీ గుర్తించి పోలీసులు విచార‌ణ‌కు పిలుస్తారా?  లేక ఆ ప్ర‌ముఖులు అంత వ‌ర‌కూ రాకుండానే ఈ కేసును నీరుగారుస్తారో!

పవన్ విశాఖ టూర్ ఎలా సాగుతుందో

ఈ పెద్ద మనిషి ఇక మారడా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?