Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ హీరోయిన్ డ్ర‌గ్స్ అమ్మ‌కాలు సాగించిందా?

 ఆ హీరోయిన్ డ్ర‌గ్స్ అమ్మ‌కాలు సాగించిందా?

టాలీవుడ్ లోనూ డ్ర‌గ్స్ వాడ‌కం దార్లు దొరికారు, బాలీవుడ్ లోనూ ఆ త‌ర‌హా అల‌వాట్ల‌తో ఎన్సీబీ విచార‌ణ‌కు కొంత‌మంది హీరోయిన్లు హాజ‌ర‌య్యారు. ఇదే స‌మ‌యంలో శాండ‌ల్ వుడ్ లోనూ డ్ర‌గ్స్ ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతూ ఉన్నాయి. అయితే టాలీవుడ్, బాలీవుడ్ ల హీరోయిన్ల క‌న్నా శాండ‌ల్ వుడ్ హీరోయిన్ల ది కాస్త భిన్నమైన స్టోరీ అనే వార్త‌లు వ‌స్తున్నాయి. 

హైద‌రాబాద్ లో డ్ర‌గ్స్ డీల‌ర్లు దొరికిన‌ప్పుడు వారు ప‌లువురు సినీ సెల‌బ్రిటీల‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసిన విష‌యం బ‌య‌ట‌ప‌డింది. అలాంటి జాబితాలోని వారంద‌రినీ అప్ప‌ట్లో ఏర్పాటైన సిట్ విచార‌ణ‌కు పిలిపించింది. వారంద‌రినీ సిట్ దాదాపు బాధితులుగా ప్ర‌క‌టించింది. డ్ర‌గ్స్ వినియోగ‌దారుల‌ను బాధితులుగానే ట్రీట్ చేసింది. వాళ్ల అరెస్టులు, వాళ్ల‌పై కేసు న‌మోదులు ఇలాంటివేమీ అప్ప‌ట్లో జ‌ర‌గ‌లేదు.

బాలీవుడ్ వ్య‌వ‌హారం కూడా కాస్త అటూ ఇటూ టాలీవుడ్ లాగానే ఉంది. రియా, దీపిక‌, శ్ర‌ద్ధా క‌పూర్ వంటి వాళ్ల‌ను ఎన్సీబీ విచార‌ణ‌కు పిలిపించుకుంది. వారిపై ప్రేక్ష‌కుల నుంచి తీవ్ర విమర్శ‌లే వ‌చ్చినా.. ఎన్సీబీ మాత్రం వారిపై కేసులు పెట్ట‌లేదు. ఒక్క రియా చ‌క్ర‌బ‌ర్తిని మాత్ర‌మే క‌స్ట‌డీలోకి తీసుకున్నారు.  మిగ‌తా హీరోయిన్ల‌పై అలాంటి చ‌ర్య‌లు కూడా లేవు. ఇంత‌కీ ఆ విచార‌ణ‌ల్లో ఏం జ‌రిగిందో కూడా ఎన్సీబీ స్ప‌ష్ట‌త‌ను ఇవ్వ‌లేదు!

క‌న్న‌డ‌నాట మాత్రం న‌టి సంజ‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఆమె ప్ర‌ధానంగా డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా దారుగా వ్య‌వ‌హ‌రించింద‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. ఆమె గ్రాండ్ గా పార్టీలు ఇచ్చేద‌ని.. ఆ పార్టీల్లో ప్ర‌ముఖుల పిల్ల‌ల‌కు, మ‌రి కొంద‌రు సెల‌బ్రిటీల‌కు డ్ర‌గ్స్ ను ఆమె స‌ప్లై చేసింద‌నే లీకులు ఇస్తున్నాయి విచార‌ణ క‌మిటీలు. ఆ అమ్మ‌కాల ద్వారా ఆమె భారీ ఎత్తున డ‌బ్బులు సంపాదించింది.. అనేది జ‌రుగుతున్న ప్ర‌చారం.  వాడితే బాధితులు అవుతారు, అమ్మితే వ్యాపారులు అవుతారు.. ఈ ర‌కంగా సంజ‌న వ్యాపారి అనే ప్ర‌చారం సాగుతూ ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?