Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సంక్రాంతికి రుమాళ్లు వేస్తున్నారు

సంక్రాంతికి రుమాళ్లు వేస్తున్నారు

పోస్ట్ కోవిడ్ హడావుడి టాలీవుడ్ లో ప్రారంభమైంది. సగంలో ఆగిపోయినవి, దాదాపు పూర్తి కావచ్చినవి అన్నీ చకచకా రెడీ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయినా సినిమాలను మాత్రం సంక్రాంతికే వేయాలని చాలా మంది నిర్మాతలు డిసైడ్ అయిపోయారు. ఇప్పటికే నితిన్-కీర్తి సురేష్-వెంకీ అట్లూరిల రంగ్ దే సినిమా సంక్రాంతికే అని ప్రకటించేసారు. ఆ వెంటనే అఖిల్-పూజా హెగ్డే-బొమ్మరిల్లు భాస్కర్ ల బ్యాచులర్ సినిమా కూడా సంక్రాంతికే అని ప్రకటించారు.

ఇదిలా వుంటే ఇప్పటకే అన్ని విధాలా రెడీగా వున్న రామ్ రెడ్ సినిమాను కూడా సంక్రాంతి బరిలోకే దించాలని చూస్తున్నారు. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందించారు. టాగోర్ మధు నిర్మిస్తున్న రవితేజ-శృతి హాసన్ ల క్రాక్ సినిమా కూడా సంక్రాంతి కే వస్తుందని వినిపిస్తోంది. ఆ సినిమాను ఓటిటికి అడుగుతున్నారు కానీ, ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఓటిటికి ఇవ్వకపోతే నేరుగా సంక్రాంతికే రావాలని డిసైడ్ అయ్యాురు.

దిల్ రాజు నిర్మిస్తున్న మెగా మూవీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కూడా సంక్రాంతి దిశగానే రెడీ అవుతోంది. ఈ మేరకు దిల్ రాజు డిసైడ్ అయిపోయి, సైలంట్ గా వున్నారు. సాయి ధరమ్ తేజ్ 'సోలో బతుకు' ఓటిటికి ఫిక్స్ అయింది కానీ అక్టోబర్ నుంచి థియేటర్లు వుంటాయి అనే సరికి కాస్త ముందు వెనుకలు ఆడుతున్నారు. 

ఇక మిగిలినవి రెండే సినిమాలు. ఒకటి వైష్ణవ్ తేజ్ ఉప్పెన, రెండు చైతన్య లవ్ స్టోరీ. ఆసియన్ సునీల్ నిర్మిస్తున్న సాయిపల్లవి 'లవ్ స్టోరీ' సినిమాను డిసెంబర్ మూడో వారానికి డిసైడ్ అయ్యారు. మరి ఉప్పెన ఎప్పుడు వేస్తారు అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మొత్తం మీద చూస్తుంటే సంక్రాంతి బరిలోకి దాదాపు నాలుగైదు సినిమాలు దిగేలా వున్నాయి.

నాగ‌బాబూ ...మ‌రీ ఇంత దిగ‌జారుడేంది?

నాకు లవ్ స్టోరీలు నచ్చవు.. హెబ్బా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?