బాహుబలి ప్రభాస్ ఫ్యాన్స్ చిరకాలంగా ఎదురు చూస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా విడుదల జూలై 30 కి కావాల్సి వుంది. ఇది ఎప్పుడో అనుకున్న డేట్. కానీ కరోనా కారణంగా సినిమా షెడ్యూలు వెనకబడింది. అందుకే ఇప్పుడు కొత్త డేట్ ప్రకటించబోతున్నారు.
2022 సంక్రాంతికి రాధేశ్యామ్ విడుదల అని మరో ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం వుంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ల సినిమాలు వున్నాయి.
ఈ రెండూ అఫీషియల్ గానే సంక్రాంతి విడుదల అని ఇప్పటికే ప్రకటించేసాయి. సంక్రాంతికి రెండు సినిమాల వరకు ఓకె కానీ మూడో సినిమా అంటే కష్టమే. మరి ఎవరు పోటీలోంచి తప్పుకుంటారో చూడాలి.
ఇప్పటికే ఆలస్యం అయినందున రాధేశ్యామ్ కు సంక్రాంతిని వదిలి డిసెంబర్ మూడో వారానికి ఇటు మహేష్ సినిమా కానీ, అటు పవన్ సినిమా కానీ వెళ్లాల్సి వుంటుంది. కానీ అలా జరుగుతుందా? లేదా? అన్నది చూడాల్సి వుంటుంది.
అసలే గోదావరి జిల్లాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ కు పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మధ్య విపరీతమైన పోటీ వుంటుంది. అలాంటిది ఆ ఇద్దరి సినిమాలు ఒకేసారి వచ్చాయంటే హడావుడి ఓ రేంజ్ లో వుంటుంది.