Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సంక్రాంతి వరకు యాభై శాతమే

సంక్రాంతి వరకు యాభై శాతమే

పెద్ద సినిమా నిర్మాతలకు ఇది నిరాశే. చిన్న, మీడియం సినిమా లకు ఓకె. కరోనా కల్లోలం రెండో దశ ముగిసిన తరువాత థియేటర్లు తెరుచుకున్నా యాభై శాతంతోనే తెరుచుకుంటాయి. 

అంతే కాదు, వ్యాక్సినేషన్ నూటికి నూరు శాతం జరిగే వరకు ఆంధ్ర లో థియేటర్లకు నూటికి నూరు శాతం అనుమతి ఇవ్వరు. ఇది ఆంధ్ర అధికార వర్గాల బోగట్టా. 

తెలంగాణలో కూడా కరోనా కల్లోలం రెండో దశ తగ్గుముఖం పట్టేసినా వెంటనే థియేటర్లకు అనుమతి ఇవ్వరు అని తెలుస్తోంది. ఈసారి చాలా గ్యాప్ తీసుకుని మాత్రమే థియేటర్లు తెరుస్తారని తెలుస్తోంది. 

మొదటి దశ తరువాత తొందరపడి థియేటర్లు తెరిచామని, రెండో దశ తరువాత అలా చేయకూడదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయని తెలుస్తోంది.

ఆంధ్రలో మాత్రం ఎప్పుడు వ్యాక్సినేషన్ నూరు శాతం పూర్తయితే అప్పుడే నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తారు. బహుశా 2022 లోనే ఆ అవకాశం వుంటుందని తెలుస్తోంది. మరి ఈ లోగా పెద్ద సినిమాల పరిస్థితి ఏమిటో? అసలే టికెట్ రేట్లు తగ్గాయి. ఆపై యాభై శాతం ఆక్యుపెన్సీ. కష్టమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?