Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శర్వా సినిమాలకు..ఆ నలుగురు

శర్వా సినిమాలకు..ఆ నలుగురు

హీరో శర్వానంద్ మారడం లేదు. సీరియస్ సినిమాల జోనర్ నుంచి పక్కకు జరగడం లేదు. రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు సినిమాలు ఎందుకు హిట్ అయ్యాయో గమనించడం లేదు.

తుపాకులు, యాక్షన్  సీన్లు లేదా అంటే సీరియస్ లవ్ సినిమాలు. అందువల్ల ప్రతి సినిమాలో శర్వానంద్ ఒక్క మాదిరిగానే కనిపిస్తున్నాడు. అస్సలు వైవిధ్యం వుండడం లేదు.

తన గెటప్ లో కానీ, ఫ్రేస్ ఎక్స్ ప్రెషన్ లో కానీ తేడా వుండడం లేదు. అది జానూ అయినా, మహా సముద్రం అయినా, ఏదయినా శర్వా ఒక్క మాదిరిగానే కనిపిస్తున్నాడు.

రణరంగం సినిమా. ఎనిమిది కోట్లు హుష్ కాకి. నిర్మాత నాగవంశీ.

పడి పడి లేచె మనసు. పది కోట్లు నష్టం. నిర్మాత సుధాకర్.

శ్రీకారం... ఎనిమిది కోట్లు నష్టం....నిర్మాత రామ్ ఆచంట

మహా సముద్రం...నష్టం..లాభం..అన్నది లెక్కలు తేలాల్సి వుంది. నిర్మాత అనిల్ సుంకర.

శర్వా సినిమాలు అంటే శాటిలైట్ కావడం కూడా కష్టంగానే వుంది. ఇకపై శర్వా మారాల్సి వుంది. ముఖ్యంగా గెటప్ లో కూడా మార్పు రావాల్సి వుంది. అదే భగ్నప్రేమికుడి కళతో సదా కనిపిస్తూ వుంటే ఎలా? కాస్త నవ్వాలి..నవ్వించాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?