శర్వా గొడవ..లీకులు ఎవరి పని?

14 రీల్స్ ప్లస్ తో తన వివాదంపై హీరో శర్వానంద్ లీకులు వదల్తున్నారా? ఇలా అనే టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఈ సాయంత్రం వున్నట్లుండి మీడియాకు శర్వానంద్ పారితోషికం విషయంలో 14 రీల్స్ పై…

14 రీల్స్ ప్లస్ తో తన వివాదంపై హీరో శర్వానంద్ లీకులు వదల్తున్నారా? ఇలా అనే టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఈ సాయంత్రం వున్నట్లుండి మీడియాకు శర్వానంద్ పారితోషికం విషయంలో 14 రీల్స్ పై కంప్లయింట్ చేసారనే లీక్ వచ్చింది. 

ఏమిటి విషయం అని ఆరా తీస్తే, ఈ లీకును శర్వానంద్ క్యాంప్ నుంచే బయటకు వస్తున్నాయని టాక్ వినిపించింది. ఆరు కోట్ల రెమ్యూనిరేషన్ లో యాభై లక్షలు బాకీ వుండిపోయిందని శర్వా ఫిర్యాదు చేసారు అన్నది లీకుల సారాంశం. కానీ ఎక్కడ ఫిర్యాదు చేసారు అన్నది క్లారిటీ లేదు.

నిజానికి వాస్తవం ఏమిటంటే గత నాలుగు సినిమాలుగా శర్వానంద్ వల్ల నిర్మాతలే గుల్లయిపోయారు అన్నది. 14 రీల్స్ ప్లస్ శ్రీకారం సినిమా టైమ్ లో జాను సినిమా విడుదలై ఫ్లాప్ అనే పేరు మూటకట్టుకుంది. దాంతో ఫీల్ అయిన శర్వా అమెరికా వెళ్లిపోయి మూడు నెలల పాటు రాలేదని టాక్. దాని వల్ల శ్రీకారం సినిమా ఇన్ టైమ్ లో రెడీ కాలేకపోయింది. బోలెడు వడ్డీలు కట్టుకోవాల్సి వచ్చింది.

రణరంగం టైమ్ లో ఆ సినిమా షూట్ వుండగానే మధ్యలో పడి పడి లేచె మనసు సినిమాను దూర్చారు. దాని వల్ల రణరంగం విపరీతంగా ఆలస్యం అయిపోయింది. దాని వల్ల నిర్మాతలకు బోలెడు వడ్డీలు లాస్ అయ్యాయి.

జాను టైమ్ లో యాక్సిడెంట్ కావడంతో ఆ సినిమా కూడా ఆలస్యమైంది. పైగా పడి పడి లేచె మనసు, జాను, శ్రీకారం, రణరంగం అన్నీ ఫ్లాపులే.

ఇలాంటి టైమ్ లో ఒక హీరో కేవలం యాభై లక్షల కోసం ఫిర్యాదు చేసినట్లు లీకులు మీడియాలోకి పంపడం ఏమిటి అని కామెంట్లు వినిపిస్తున్నాయి. అసలు ఈ లీకులు ఎక్కడ ప్రారంభం అయ్యాయో? ఎవరి ద్వారా ఒకరికి నుంచి ఒకరికి అందాయో అన్నది సినిమా జనాలు ఆరా తీస్తున్నారు.