cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

షణ్ముఖ్ ఏంట్రా ఇదీ?

షణ్ముఖ్ ఏంట్రా ఇదీ?

యూ ట్యూబ్ సీరియళ్లు, షార్ట్ ఫిలిం లు ఫాలో అయ్యేవారికి షణ్ణు..షణ్ముఖ్,,షణ్మఖ్ జస్వంత్ పేరు బాగా పరిచయం. షణ్ముఖ్ పాపులారిటీ గమనించి ఈ మధ్య గేమ్ షో లకు కూడా పిలుస్తున్నారు. 'ఏంట్రా ఇదీ' అనే ఊతపదం బాగా పాపులర్. అది ఇతగాడిదే.

ఇంతకీ ఇప్పుడు విషయం ఏమిటంటే, చాలా మంది సెలబ్రిటీల మాదిరిగానే మందు కొట్టి, డ్రయివర్ కు స్టీరింగ్ అప్పగిస్తే సింపుల్ గా పోయే ఆలోచన వదిలేసి, స్వంతగా నడిపి, వేరే వాళ్ల ప్రాణాల మీదకు తెచ్చాడు.

దాంతో కేసు, రెండు పీకడాలు వగైరా.వగైరా..బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేస్తే కౌంట్ 170 వచ్చిందట. నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. షణ్ముఖ్ జస్వంత్ మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని పోలీసులు తెలిపారు.

అతి వేగంగా కారు నడిపి మూడు వాహనాలను ఢీ కొట్టాడన్నారు. ఈ ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ

లోకేష్‌కు  పిచ్చి పీక్స్‌కు చేరిపోయింది

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×