Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆర్య‌న్ ఖాన్ కు బాడీగార్డ్ కావాలెను!

ఆర్య‌న్ ఖాన్ కు బాడీగార్డ్ కావాలెను!

త‌మ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ కు స‌మ‌ర్థుడైన‌, న‌మ్మ‌క‌స్తుడైన బాడీ గార్డును వెదుకుతున్నార‌ట బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్, ఆయ‌న భార్య గౌరీ. ఇటీవ‌లే డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో అరెస్టు అయ్యి, ఎన్సీబీ క‌స్ట‌డీలో, జైల్లో కొన్నాళ్లు ఉండి.. చివ‌ర‌కు బెయిల్ మీద ఆర్య‌న్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఆర్య‌న్ ఖాన్ ఇలా దొర‌క‌డంపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు అయితే ప్ర‌చారంలో ఉన్నాయి.

వీటిల్లో ఎవ‌రి న‌మ్మ‌కం వారిది. ఆర్య‌న్ డ్ర‌గ్స్ వాడే దొరికి ఉంటాడ‌ని కొంద‌రు న‌మ్ముతుంటే, అరెస్టు చేసిన అధికారిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు, ఆర్య‌న్ ఖాన్ ను అదుపులోకి తీసుకునే ముందు డ‌బ్బులు డిమాండ్ చేశార‌నే ప్ర‌చారాలూ గ‌ట్టిగా సాగుతున్నాయి. ఈ విష‌యంలో వినిపిస్తున్న మ‌రో మాట‌.. ఆర్య‌న్ కిడ్నాప్ కు కూడా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌నేది. వీటిల్లో ఏది నిజ‌మో, ఏది అబ‌ద్ధ‌మో క‌చ్చితంగా చెప్పే వారు లేరు. 

మ‌రి ఈ విష‌యంలో షారూక్, గౌరీలు ఏదో ఒక‌టి న‌మ్ముతూ ఉంటారు. వారేమ‌నుకుంటున్నారో కానీ, ప్ర‌స్తుతానికి అయితే బాడీగార్డ్ ను వెదికే ప‌నిలో ఉన్నార‌ట‌. ఈ విష‌యాన్ని తెలుసుకున్న వివిధ సెక్యూరిటీ ఏజెన్సీలు ఈ విష‌యంలో తాము సేవ‌ల‌నందిస్తామంటూ రెడ్ చిల్లీస్ ఆఫీస్ ను సంప్ర‌దిస్తున్నాయ‌ట‌. అలాగే కొంద‌రు వ్య‌క్తిగ‌తంగా కూడా తాము ఆ డ్యూటీ స్వీక‌రిస్తామ‌ని అంటున్నార‌ట‌. 

బాలీవుడ్ జనాలు ఇప్పుడు బాడీగార్డ్స్ పై భారీగా ఖ‌ర్చు పెడుతున్న‌ట్టుగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. కొంద‌రు హీరోయిన్లు, సినిమా ఫ్యామిలీలు.. నెల‌కు కోటి రూపాయ‌ల జీతాన్ని ఇచ్చి కూడా ప్రైవేట్ సెక్యూరిటీని మెయింటెయిన్ చేస్తున్నార‌నే వార్త‌లూ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆర్య‌న్ ఖాన్ సెక్యూరిటీ నిమిత్తం కూడా షారూక్ భారీ మొత్తాల‌ను ఖ‌ర్చు చేయ‌డానికి వెనుకాడ‌క‌పోవ‌చ్చ‌ని స్ప‌ష్టం అవుతోంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?