షాకింగ్…ఆర్ఆర్ఆర్ లో జీతాలు ఆపేసారు?

ఆర్ఆర్ఆర్…టాలీవుడ్ లో అత్యంత భారీ చిత్రం కాబోతోంది. భారీ మల్టీ స్టారర్. ఎన్టీఆర్-రామచరణ్-అజయ్ దేవగన్-ఆలియాభట్-సముద్రఖని ఇలా చాలా మంది వున్నారు. ఈ సినిమా ఇప్పటికి కొంత వరకు పూర్తయింది. కానీ కరోనా కారణంగా షూటింగ్…

ఆర్ఆర్ఆర్…టాలీవుడ్ లో అత్యంత భారీ చిత్రం కాబోతోంది. భారీ మల్టీ స్టారర్. ఎన్టీఆర్-రామచరణ్-అజయ్ దేవగన్-ఆలియాభట్-సముద్రఖని ఇలా చాలా మంది వున్నారు. ఈ సినిమా ఇప్పటికి కొంత వరకు పూర్తయింది. కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. జూన్ నెలాఖరులో ప్రారంభించాలని అనుకున్నా కుదరలేదు. 

చాలా కంపెనీల మాదిరిగా ఆర్ఆర్ఆర్ లో కూడా కరోనా టైమ్ లో సగం జీతాలు ఇచ్చారు. అయితే ఈనెలలో మాత్రం ఇక జీతాలు ఇవ్వమని, మళ్లీ షూటింగ్ లు ప్రారంభం అయ్యాకే ఇస్తామని చెప్పేసారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఇది యూనిట్ అంతటికీనా? కాదా? అన్న సంగతి తెలియకదు కానీ, యూనిట్ లోని ఓ కీలక డిపార్ట్ మెంట్ లో మాత్రం టీమ్ మొత్తానికి మళ్లీ షూటింగ్ మొదలయ్యే వరకు జీతాలు వుండవని చెప్పినట్లు తెలుస్తోంది. మిగిలిన డిపార్ట్ మెంట్ ల సంగతి తెలియాల్సి  వుంది.

నిజానికి జీతాలు ఆపేసిన యూనిట్ కు పూర్తి జీతాలు చెల్లించినా మహా అయితే నెలకు అయిదు లక్షలు కూడా కావు అని తెలుస్తోంది. మొన్నటి దాగా సగం ఇచ్చారు. ఇప్పుడు అదీ ఆపేసారు. ఎంత సేవ్ చేస్తారు దీనివల్ల. మహా అయితే మూడు నెలలకు 15లక్షలు. ఈ మాత్రానికే ఎందుకు ఆపేస్తారు? అన్నది ప్రశ్న.

కానీ సమాధానం కూడా సరైనదే వినిపిస్తోంది. కరోనా వల్ల ఆర్ఆర్ఆర్ షూటింగ్ మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్నది క్లారిటీ లేదని, అది మూడు నెలలా? ఆరు నెలలా? అన్నది తెలియదని, అందుకే ఆపేసి వుంటారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

రఘురామకృష్ణంరాజు దిగజారిపోయాడు

ఇక నుంచి నో లంచం నో దళారీ