cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

షూటింగ్ లకు సీనియర్లు దూరం?

షూటింగ్ లకు సీనియర్లు దూరం?

టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయని ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తుంటే, ఈ వార్త కాస్త షాకింగ్ గా వుంది. ఇండస్ట్రీలో వున్న 60కి దగ్గరగా వచ్చిన, లేదా 60 దాటిన నటులు ఎవ్వరూ ఇప్పట్లో షూటింగ్ లకు రాకూడదని ఫిక్స్ అయ్యారన్నదే ఆ వార్త.

మెగాస్టార్ చిరంజీవి, వెంకీ, నాగ్, బాలయ్య, వీళ్లంతా అరవైకి అటు ఇటు వున్నవారే. వీళ్ల నలుగురిలో మొదటి ముగ్గురి సినిమాలు సగంలో ఆగాయి. బాలయ్య సినిమా ఓ షెడ్యూలు జరిగింది. ఇప్పుడు ఈ నలుగురు కనుక వ్యాక్సీన్ వచ్చేవరకు షూటింగ్ లకు రాము అని కచ్చితంగా ఫిక్స్ అయితే కనుక, నాలుగు సినిమాలు ఆగిపోతాయి.

యంగ్ హీరోల సినిమాలకు సమస్యే

ఇదిలా వుంటే యంగ్ హీరోల సినిమాలకు మరో సమస్య. ఆర్ఆర్ఆర్ కు విదేశీ టెక్నిషియన్లు, నటులు రావాల్సివుంది. అందువల్ల దానికీ ప్రాబ్లమ్ నే. ప్రభాస్ సినిమాను చకచకా రెడీ చేసేద్దాం అనుకున్నా, బాలీవుడ్ లో సినిమాలు అన్నీ సెట్ చేసుకుని డేట్ లు ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడే ప్రభాస్ సినిమా డేట్ కూడా ఫిక్స్ అవుతుంది. అందువల్ల ఏవో కొద్ది సినిమాలు తప్ప, షూటింగ్ లకు అనుమతి ఇచ్చేసినా, చకచకా సినిమాలు రెడీ అయిపోతాయన్న నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో కనిపించడం లేదు. 

ఈనాడు తప్పుడు రాతలు రాస్తోంది