Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బ్రేకప్ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టిందా!

బ్రేకప్ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టిందా!

అవకాశాలు రాని రోజుల్లో వాటి కోసం గట్టిగా ప్రయత్నించింది. 'ఐరన్ లెగ్' అంటూ ఆమెను అంతా పక్కన పెట్టినప్పుడు హీరోయిన్ గా సక్సెస్ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. సక్సెస్ సొంతం అయ్యింది. స్టార్ హీరోయిన్ అయ్యింది. అవకాశాలే ఆమెను వెతుక్కొంటూ రావడం మొదలైంది. అయితే అలాంటి సమయంలో సినిమాలకు దూరం అవుతూ వచ్చింది శ్రుతి హాసన్.

ఒకదశలో అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నించిన ఆమె, అవకాశాలు చేతికి వచ్చాకా మాత్రం వాటికి దూరం అయ్యింది. డేటింగ్ – ప్రేమ...  వైపు పయనించింది. విదేశీ బాయ్ ఫ్రెండ్ తో షికార్లు చేసింది. పెళ్లి చేసుకుని అలా సెటిలవ్వబోతోందనే వార్తలూ వచ్చాయి. అయితే .. అంతలోనే బ్రేకప్ అనేసింది. చాలా తొందరగానే ఇటాలియన్ బాయ్ ఫ్రెండ్ తో శ్రుతి హాసన్ ప్రేమ బ్రేకప్ అయ్యింది.

ఈ నేపథ్యంలో ఆమె తిరిగి సినిమాలతో బిజీ అయ్యేయత్నంలో ఉన్నట్టుంది. అందులో భాగంగా శ్రుతితో ఇదివరకూ పనిచేసిన వారే కోరి ఆమెను తీసుకునేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందే సినిమా ఒకటి ప్రతిపాదనలో ఉంది.

దాంట్లో హీరోయిన్ గా శ్రుతిహాసన్ ను అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇదివరకూ రవితేజతో శ్రుతిహాసన్ కు హిట్ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందని తెలుస్తోంది.

ఎన్టీయార్‌ పేరుతో గెలిచేశారు.. లంచం తీసుకుంటే పట్టించారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?