Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సిద్దు..నరుడి బతుకు నటన

సిద్దు..నరుడి బతుకు నటన

ఎన్ని సినిమాలు చేసామన్నది క్వశ్చను కాదు. ఏ సినిమా బ్రేక్ ఇచ్చింది అన్నది పాయింట్. సిద్దు జొన్నలగడ్డ కు కృష్ణ అండ్ హిస్ లీల సినిమా అలాంటి బ్రేక్ ఇచ్చేసింది. సినిమా  జనాల దృష్టి అతనిపై పడింది. ఎంత మంది హీరోలు వున్నా టాలీవుడ్ కు కొరత తీరదు. సరైన టాలెంట్ కోసం ఎదురు చూస్తూనే వుంటుంది. అందుకే ఎవరి ప్రయత్నం వాళ్లు చేస్తూనే వుంటారు.

సిద్దుకు అలా చాన్స్ లు వెదుక్కుంటూ వచ్చాయి. కృష్ణ అండ్ హిస్ లీల తరువాత సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో సినిమా స్టార్ట్ చేసాడు. కొత్త దర్శకుడితో కలిసి తనే స్క్రిప్ట్ తయారు చేసుకున్నాడు. మళ్లీ శ్రద్ద శ్రీనాధ్ నే హీరోయిన్.  సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాత.

ఈ సినిమాకు 'నరుడి బతుకు నటన' అనే మాంచి టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ టైటిల్ ను, లోగోను రేపు (శుక్రవారం) విడదుల చేయబోతున్నారు.  అన్నీ సెట్ అయితే థియేటర్లో లేదూ అంటే ఓటిటిలో ఈ సినిమాను ఈ ఏడాదిలోనే చూడొచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?