Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సితారలో మరో స్పోర్ట్స్ మూవీ

సితారలో మరో స్పోర్ట్స్ మూవీ

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తీసిన జెర్సీ మూవీతో మంచి క్రెడిబులిటీ తెచ్చుకుంది సితార సంస్థ. ఆ సినిమాను అరవింద్, దిల్ రాజు భాగస్వామ్యంతో హిందీలోకి కూడా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మరో స్పోర్ట్స్ బేస్డ్ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే దీని కథ, కమామిషు ఇంకా తెలియకపోయినా, ఈ స్క్రిప్ట్ తయారుచేస్తున్నది దర్శకుడ వెంకీ అట్లూరి. ఆయన ఇప్పుడు సితార సంస్థ ఆస్థాన డైరక్టర్లలో ఒకరిగా మారిపోయారు. ఒకపక్క రంగ్ దే సినిమా చేస్తూనే, ఈ స్పోర్ట్స్ బేస్డ్ కథను రెడీ చేస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ కు సరిపడా కథను వండే ప్రయత్నాల్లో వున్నారు. 

ఆ కథ కూడా కుదిరిపోయి పవన్ ఓకె అంటే మరొ రెండేళ్ల వరకు వెంకీ అట్లూరి సితార సంస్థను వదిలి బయటకు రారేమో?  అది కూడా పవన్ సినిమా ఓకె అయితే ఒక ఏడాది, రెండేళ్లు అని టైమ్ బౌండ్ వ్యవహారం కూడా వుండదు.

రైతుల్ని భ్రమల్లోనే ఉంచుతున్న బాబు

కేసిఆర్ అడ్డాపై కన్ను

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?