cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బ్ర‌హ్మ‌ణుల కేసు.. శ్రీముఖి ఏమంటోందంటే!

 బ్ర‌హ్మ‌ణుల కేసు.. శ్రీముఖి ఏమంటోందంటే!

ఒక టీవీ షోలో బ్ర‌హ్మ‌ణ సామాజిక‌వ‌ర్గం మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా వ్యాఖ్యానాలు చేసిందంటూ న‌టి శ్రీముఖిపై కేసు న‌మోదు అయిన సంగ‌తి తెలిసిందే. మామూలుగా శ్రీముఖి వంటి వాళ్లు క‌నిపించే టీవీ షో లు ప‌ర‌మ లేకిగా ఉంటాయి. దిగువ స్థాయి మాట‌లు, డ‌బుల్ మీనింగులు.. వాటిల్లోని కంప‌రాన్ని కొత్త‌గా వ‌ర్ణించాల్సిన అవ‌స‌రం లేదు. అయితే జ‌నాలు వాటినే చూస్తున్నార‌ట‌, టీవీ చాన‌ళ్లు వాటినే ప్ర‌సారం చేస్తున్నాయి. అదంతా రొటీన్ సీరియ‌ల్.

ఆ సంగ‌త‌లా ఉంటే.. అలాంటి షో ఒక దానితో యాంక‌ర్ శ్రీముఖి ఇప్పుడు కేసును ఎదుర్కొంటూ ఉంది. బ్ర‌హ్మ‌ణుల మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచేలా ఆమె మాట్లాడింద‌నే అభియోగాల‌ను ఆమె ఎదుర్కొంటూ ఉంది. ఈ క్ర‌మంలో ఈ వ్య‌వ‌హారంపై శ్రీముఖి స్పందించింది.

ఒక వార్తా సంస్థ‌తో ఆమె.. ఈ విష‌యంపై స్పందించింది. త‌న‌పై కేసు చెల్ల‌ద‌ని శ్రీముఖి అంటోంద‌ట‌. త‌ను యాంక‌ర్ మాత్ర‌మేన‌ని అంటోంద‌ట‌. అలాగే ఆ టీవీ షో కూడా ఇప్ప‌టిది కాదు అనేది శ్రీముఖి మాట‌. రెండేళ్ల కింద‌ట షూట్ చేసి, అప్ప‌ట్లోనే ప్ర‌సారం చేసిన వ్య‌వ‌హారంపై ఇప్పుడు కేసేంట‌ని అంటోంద‌ట శ్రీముఖి. రెండేళ్ల కింద‌ట ఆల్రెడీ టెలికాస్ట్ అయిన ఆ ప్రోగ్రామ్ ను ఇప్పుడు లాక్ డౌన్ నేప‌థ్యంలో మ‌ళ్లీ ఆ చాన‌ల్ వాళ్లు ప్ర‌సారం చేసిన‌ట్టుగా ఉన్నారు. ఈ సారి చూసిన వారు ఎవ‌రో అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ శ్రీముఖి మీద ఫిర్యాదు చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

పాత ప్రోగ్రామ్ కు ఇప్పుడు కేసు ఏమిట‌ని, అయితే ఈ కేసులో త‌ను పోలీసుల‌కు పూర్తిగా స‌హ‌క‌రించ‌బోతున్న‌ట్టుగా శ్రీముఖి స్పందించిన‌ట్టుగా ఆ వార్తా సంస్థ క‌థ‌నాన్ని ఇచ్చింది.

నాకు ఓటు వెయ్యనోడికి కూడా ఇళ్ల పట్టాలిస్తా