Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సూపర్ స్టార్ ఫ్యామిలీ ఎక్కడ?

సూపర్ స్టార్ ఫ్యామిలీ ఎక్కడ?

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్ బాబు నిర్మాతగా మారారు. ఆయన ఓ చిన్న సినిమాను సైలెంట్ గా నిర్మించేసారు. అయితే సినిమా పూర్తయిన తరువాత ఇప్పుడు బ్యానర్ ను, బ్యానర్ లోగోను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన తను పనిచేసిన డైరక్టర్లను, నిర్మాతలను, సినిమా జనాలను కోరి కోరి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం సింపుల్ గా జరిగింది.

కానీ చిత్రమేమిటంటే, సుధీర్ బాబు అత్తింటివారైన సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ సభ్యులు ఎవ్వరూ ఈ ఫంక్షన్ కు హాజరయినట్లు లేదు. తను నిర్మాతగా మారుతున్నందున ఇండస్ట్రీకి చెందిన సక్సెస్ ఫుల్ నిర్మాతలను ఫంక్షన్ కు పిలవాలన్నది సుధీర్ బాబు ఆలోచన అంట. బాగానే వుంది. అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజును పిలిచారు. ఇంకా బాగుంది. కానీ వీరి కన్నా ముందే సుధీర్ బాబు మామగారు హీరో కృష్ణ కూడా సక్సెస్ ఫుల్ నిర్మాత అన్న సంగతి మరిచిపోతే ఎలా?

అలాగే సుధీర్ బాబు స్వంత బ్యానర్ ప్రారంభిస్తున్నపుడు, నిర్మాతలు, కాన్సెప్ట్ లు కాకుండా కృష్ణ, మహేష్ బాబు లాంటి వాళ్లు హాజరయితే, ఆ గ్లామర్ వేరుగా వుంటుంది. మహేష్ బాబు ఊరిలో లేరు అంటున్నారు. నిజంగా మహేష్ రావాలనుకుంటే, ఆయన ఊళ్లో వున్నపుడు ఫంక్షన్ చేయవచ్చుగా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

ఏమిటో మరి సుధీర్ బాబు కాన్సెప్ట్?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?