cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మ‌రింత మంది హీరోయిన్ల‌తో సుఖేష్ కు లింకులు!

మ‌రింత మంది హీరోయిన్ల‌తో సుఖేష్ కు లింకులు!

ఇప్ప‌టికే న‌టీమ‌ణులు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫ‌తేల‌కు భారీ గిఫ్టులు ఇచ్చిన‌ట్టుగా ఈడీకీ స్టేట్ మెంట్ ఇచ్చిన సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ ఇప్పుడు మ‌రిన్ని బాంబులు పేల్చిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. త‌న‌కు మ‌రింత మంది బాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో సంబంధాలు ఉన్నాయ‌ని, వారు కూడా త‌న నుంచి వివిధ ర‌కాలుగా ల‌బ్ధి పొందిన‌ట్టుగా తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ స్టేట్ మెంట్ ఇచ్చిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ జాబితాలో ప్ర‌ముఖ హీరోయిన్లు ఉండ‌టం గ‌మ‌నార్హం.

వీరిలో న‌టి శ్ర‌ద్ధా క‌పూర్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తూ ఉంది. శ్ర‌ద్ధాకు సుఖేష్ ప‌లు ర‌కాలుగా సాయ‌ప‌డ్డాడ‌ట‌. అయితే ఇది అత‌డి స్టేట్ మెంట్ మాత్ర‌మే. న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య స‌మ‌యంలో శ్ర‌ద్ధా కూడా డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో విచార‌ణ‌ను ఎదుర్కొనే ప‌రిస్థితి రాగా.. అప్పుడు సుఖేష్ ఆమెకు అండ‌గా నిల‌బ‌డ్డాడ‌ట‌. అయితే అత‌డు ఆమెకు అండ‌గా నిలబ‌డిన వైనం ఏమిట‌నేది క్లారిటీ లేని అంశ‌మే. అధికారుల‌ను మేనేజ్ చేశాడా? ఎవ‌రికైనా లంచాల‌ను ఎర‌గా వేశాడా ? అనే అంశాలు క్లారిటీ లేనివే. వీటిని విచార‌ణ‌లో ధ్రువీక‌రించాల్సి ఉంది అధికారులు. అయితే త‌ను శ్ర‌ద్ధా క‌పూర్ కు సాయంగా నిలిచిన‌ట్టుగా మాత్రం అత‌డు చెప్పాడ‌ట‌. 

ఇక మ‌రో న‌టి శిల్పా షెట్టితో కూడా త‌న‌కు స‌త్సంబంధాలున్న‌ట్టుగా సుఖేష్ త‌న స్టేట్ మెంట్లో పేర్కొన్నాడ‌ట‌. ఇటీవ‌లే శిల్పా షెట్టి భ‌ర్త పోర్న్ కేసులో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ వ్య‌వ‌హారం నుంచి కాస్త ఊర‌ట పొందుతోంది శిల్పా షెట్టి. ఇంత‌లో సుఖేష్ ఆమె పేరును వెల్ల‌డించాడ‌నే ప్ర‌చారం హాట్ టాపిక్ గా మారుతోంది.

ఇక న‌టుడు హ‌ర్మాన్ భ‌వేజా కూడా త‌న‌కు స‌న్నిహితుడే అని ఇత‌డు చెప్పాడ‌ట‌. అత‌డి సినిమా ఒక దానికి త‌ను కూడా డ‌బ్బు పెట్టిన‌ట్టుడ‌గా ఇత‌డు చెప్పుకొచ్చాడ‌ట‌. అయితే ఆల్రెడీ అరెస్టు అయిన ఇత‌డు.. చెప్పే పేర్లు కేవ‌లం కేసును కాంప్లికేట్ చేయ‌డానికేనా.. లేక నిజంగానే బాలీవుడ్ లో ఇత‌డు అల్లుకుపోయాడా.. అనే అంశాల‌పై ఇప్పుడ‌ప్పుడే క్లారిటీ రాక‌పోవ‌చ్చు. అత‌డు ఆ మేర‌కు స్టేట్ మెంట్ ఇచ్చాడ‌నే వార్త‌ల‌పై ఈ జాబితాలోని సెల‌బ్రిటీలు కూడా ఎవ‌రూ ఇంకా స్పందించ‌లేదు.

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు