సుకుమార్ హర్ట్ అయ్యాడు

అవును నిజం. మహేష్ ఇచ్చిన ఝలక్ కు దర్శకుడు సుకుమార్ హర్ట్ అయినట్లు తెలుస్తోంది. బన్నీ-సుకుమార్ సినిమా ప్రకటన ఈరోజు వచ్చింది. దీనివెనుక చాలా జరిగినట్లు తెలుస్తోంది. సుకుమార్ తన స్క్రిప్ట్ తో మహేష్…

అవును నిజం. మహేష్ ఇచ్చిన ఝలక్ కు దర్శకుడు సుకుమార్ హర్ట్ అయినట్లు తెలుస్తోంది. బన్నీ-సుకుమార్ సినిమా ప్రకటన ఈరోజు వచ్చింది. దీనివెనుక చాలా జరిగినట్లు తెలుస్తోంది. సుకుమార్ తన స్క్రిప్ట్ తో మహేష్ ను ఒప్పించాలని చాలా సిన్సియర్ గా ప్రయత్నించాడు, ముందుగా రజాకార్ మూవ్ మెంట్ బ్యాక్ డ్రాప్ లో కథ చెప్పాడు. కానీ మహేష్ పీరియాడిక్ సినిమా వద్దన్నాడు. అప్పుడు ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లో శివపుత్రుడు స్టయిల్ రా టేకింగ్ తో ఓ కథ చెప్పాడు. అంత 'రా'గా తీస్తే తన సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు నచ్చకపోవచ్చని మహేష్ అభ్యంతరం చెప్పాడు.

ఇంతలో అనిల్ రావిపూడి లైన్ లోకి వచ్చారు. ఆయనతో డిస్కషన్లు స్టార్ట్ అయ్యాయి. సుకుమార్ తన ఎర్రచందనం కథకే అడవి పక్కన చిన్న ఊరులో ఆ ఊరిలో హీరో హీరోయిన్ల ప్రేమ అంటూ లవ్ స్టోరీ అద్దారు. అయితే అనిల్ రావిపూడి సినిమా స్టార్ట్ చేస్తానని, కాస్త షూట్ అయ్యాక, సుకుమార్ సినిమాకు డేట్ లు ఇస్తానని మహేష్ సమాచారాన్ని మైత్రీ మూవీస్ కు అందించారు. కానీ మైత్రీ జనాలు ఈ విషయం సుకుమార్ కు చెబితే ఆయన అంత పాజిటివ్ గా స్పందించలేదని తెలుస్తోంది.

నెలరోజులు ఇటు నెలరోజులు అటు డేట్ లు అనే వ్యవహారానికి సుకుమార్ ఒప్పుకోలేదు. దాంతో రాత్రికి రాత్రి సీన్ మారిపోయింది. ఆ ఎర్రచందనం కథనే బన్నీతో చేయడానికి సుకుమార్ డిసైడ్ అయిపోయారు. ప్రాజెక్ట్ ను బన్నీ వైపు మార్చేసినట్లు తెలుస్తోంది. ఈ టోటల్ సినేరియాలో మైత్రీమూవీస్ కు ఎటూ, ఏమీ చేయడానికి లేకుండాపోయింది.

ట్వీట్ లు ఎందుకు వేయలేదో?
ఇలాంటి క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ మెంట్ ను జస్ట్ పీఆర్ టీమ్ తో ట్విట్టర్ లో వేసి ఊరుకున్నారు. నిర్మాణ సంస్థ మైత్రీమూవీస్ ట్వీట్ చేయలేదు. దర్శకుడు సుకుమార్ ట్వీట్ చేయలేదు. హీరో బన్నీ ట్వీట్ చేయలేదు. ఇలా సినిమాలో భాగస్వాములు, కీలకమైన వారు ముగ్గురూ ట్వీట్ లు వేయకపోవడం చిత్రమ్.

మహేష్ మీద ఒత్తిడికేనా ఇదంతా
మహేష్ తీరుతో హర్ట్ అయిన సుకుమార్ ఆయనపై వత్తిడి తేవడానికే ఈ అనౌన్స్ మెంట్ వచ్చేలా చేసారన్నది మహేష్ క్యాంప్ లో వినిపిస్తోంది. అందుకే మహేష్ హర్ట్ కాకుండా వుండడానికే ట్వీట్ లు వేయలేదని, ఎలాగైనా మహేష్ పై వత్తిడి తెచ్చి, అనిల్ రావిపూడి ప్రాజెక్టు కన్నా ముందుగా తన ప్రాజెక్టు స్టార్ట్ అయ్యేలా లేదా, తన సినిమాకు ప్రయారిటీ ఇచ్చేలా చేయడం సుకుమార్ గేమ్ ప్లాన్ అని టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు ఈ అనౌన్స్ మెంట్ తరువాత మహేష్ ఎలా రియాక్ట్ అవుతాడో అని మైత్రీమూవీస్ టెన్షన్ పడుతోన్నట్లు బోగట్టా.

ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిఫలిస్తున్న సర్వేలు!