cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాయ్ ఫ్రెండ్ కు గుడ్ బై చెప్పిన సీనియ‌ర్ న‌టి!

బాయ్ ఫ్రెండ్ కు గుడ్ బై చెప్పిన సీనియ‌ర్ న‌టి!

సుస్మితా సేన్.. న‌టిగా కూడా స‌త్తా చూసిన మాజీ విశ్వ‌సుంద‌రి. వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. సుస్మిత పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకుంది, స‌హ‌జీవ‌న అనుభ‌వాలూ ఉన్న‌ట్టున్నాయి. పెళ్లి జోలికి వెళ్ల‌కుండానే పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకుని సుస్మిత అభినంద‌న‌లు అందుకుంది. 

దాదాపు ద‌శాబ్దంన్న‌ర కింద‌టే ఒక బాలిక‌ను సుస్మిత ద‌త్త‌త తీసుకుని పెంచి, పోషిస్తూ ఉంది. ఆ త‌ర్వాత మ‌రో అమ్మాయిని కూడా ద‌త్త‌త తీసుకుంది. ఇలా పెళ్లితో సంబంధం లేకుండా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లిగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఇక సుస్మిత పెళ్లి చేసుకోక‌పోయినా.. స్నేహాలు, సాన్నిహిత్యాలు.. స‌హ‌జీవ‌నాల వార్త‌ల‌తో మాత్రం నిలుస్తూ వ‌స్తోంది. గ‌తంలో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ భ‌ట్ తో ఈమె ప్రేమాయ‌ణాన్ని సాగించింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత బ్రేక‌ప్. త‌ర్వాత వేరే ప్ర‌చారాలు కూడా జ‌రిగినా.. కొన్నేళ్లుగా ఈమె రోహ్ మ‌న్ షాల్ తో  మాత్రం స‌హ‌జీవ‌నం చేస్తున్న వార్త‌లు వ‌చ్చాయి. ఈ బంధాన్ని రోహ్ మ‌న్ కూడా ధ్రువీక‌రించాడు.

త‌ను సుస్మిత‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్న విష‌యాన్ని అత‌డు చెప్పాడు. తామంతా ఒక కుటుంబంగా సాగుతున్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించాడు. సుస్మిత కూతుళ్ల‌కు త‌ను తండ్రి లాంటివాడిని అన్నాడు. తామంతా ఒక కుటుంబంగా మెలుగుతున్న‌ట్టుగా, చాలా ఆనందంగా ఉన్న‌ట్టుగా చెప్పాడు. అయితే.. ఇప్పుడు సుస్మిత అత‌డికి గుడ్ బై చెప్పిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. వీరి మ‌ధ్య‌న బ్రేక‌ప్ అయ్యింద‌ని, వేరుప‌డ్డార‌ని టాక్. గ‌తంలో విక్ర‌మ్ భ‌ట్ తో సంబంధం విష‌యంలో సుస్మిత నింద‌ల‌కు గుర‌య్యింది. పెళ్లైన విక్ర‌మ్ భ‌ట్ తో ఆమెది వివాహేత‌ర సంబంధం అనే అభిప్రాయాలు వినిపించాయి. 

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు