గోపీచంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో 'తయారవుతున్న చిత్రం సీటీమార్`. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కబడ్డీ క్రీడ నేపథ్యంలో తయారవుతున్న చిత్రం ఇది. ఈ సినిమాలో తమన్నా కబడ్డీ కోచ్ గా నటిస్తోంది ఈ పాత్ర పేరు జ్వాలా రెడ్డి. ఈ పాత్రలో తమన్నాలుక్ ను విడుదల చేసారు.
. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ – “వెరీ ఇంట్రెస్టింగ్, ఇన్స్‌పైరింగ్ మరియు ఛాలెంజింగ్ రోల్ కబడ్డి కోచ్ జ్వాలా రెడ్డి. ఈ సినిమాలో గోపిచంద్ గారితో ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తున్నాను. అలాగే సంపత్ నంది గారి దర్శకత్వంలో `రచ్చ`, `బెంగాల్ టైగర్` తర్వాత చేస్తోన్నమూవీ ఇది అన్నారు.
చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ – “రాజమండ్రి షెడ్యూల్ పూర్తి చేసుకొని ఆర్.ఎఫ్.సిలో కొత్త షెడ్యూల్ ప్రారంభించాం. ఈ షెడ్యూల్ లో తమన్నా జాయిన్ అయ్యారు. నాన్ స్టాప్‌గా షెడ్యూల్ జరిపి సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. గోపిచంద్ కెరీర్ లోనే ఇది హై బడ్జెట్, భారీ కమర్షియల్ ఫిలిమ్ కావడం విశేషం.