సుకుమార్ తన అసిస్టెంట్ సానా బుచ్చిబాబు డైరక్షన్లో, మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్ కాంబినేషన్ లో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారని, ఆ సినిమాలో హీరోగా సాయిధరమ్ తేజ్ తమ్ముకు వైష్ణవ్ తేజ్ ను తీసుకుంటారని దాదాపు నెలన్నర క్రితం వెల్లడించింది గ్రేట్ ఆంధ్ర. ఇప్పుడు అదే నిజమైంది.
మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ ఈ రోజు ఈ కాంబినేషన్ ను అధికారికంగా ప్రకటించింది. అయితే అధికారికంగా త్వరలో అని ప్రకటించారే కానీ, ఎప్పుడు స్టార్ట్ చేసేది ఇంకా తెలిచేయలేదు. అలాగే ఇది సినిమా కోసం కొత్త హీరోయిన్ కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చారు. మరి హీరోయిన్ దొరికినట్లో, లేదో ప్రకటించలేదు.
ఇప్పటికే మైత్రీ ఇటు విజయ్ దేవరకొండతో, అలాగే సాయిధరమ్ తేజతో రెండు సినిమాలు ప్రొడక్షన్ లో వుంచింది. ఇక ఆరునెలల్లో మహేష్ సినిమా స్టార్ట్ చేస్తుంది. మరి ఈ మధ్యలోనే ఈ కొత్త ప్రాజెక్టు కూడా వుంటుందా? సుకుమార్ సూపర్ విజన్ అవసరం కాబట్టి, ఇప్పుడే మొదలు పెట్టి, మహేష్ సినిమా స్టార్ట్ అయ్యేలోగా ఫినిష్ చేసేసే ఆలోచన వున్నట్లు కనిపిస్తోంది.
అలా అయితే 2019లో అన్నదమ్ముల సినిమాలు రెండూ ఒకేసారి రెడీ అవుతాయన్నమాట. అంతాఓకె కానీ టాలీవుడ్ సెంటిమెంట్ ప్రకారం అన్న, తమ్ముడు ఇద్దరూ ఇండస్ట్రీలోకి వస్తే, ఎక్కువసార్లు తమ్ముడే గెలిచి, అన్న పక్కకు వెళ్లడం కామన్. రమేష్ బాబు, ఆర్యన్ రాజేష్, బోస్ బాబు, ఇలా తప్పుకున్నవారే.
కానీ చిరు, పవన్ ల మాదరిగా ఈ ఇద్దరు తేజ్ లు వుంటారేమో చూడాలి.