Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దెయ్యంతో దేవరకొండ సావాసం?

దెయ్యంతో దేవరకొండ సావాసం?

పెళ్లిచూపుల్లో విజయ్ దేవరకొండను చూశాం. అర్జున్ రెడ్డిలో అతడిలో మరో యాంగిల్ చూశాం. ఇప్పుడు ఈ రెండు వెర్షన్లకు పూర్తి భిన్నమైన దేవరకొండను త్వరలోనే చూడబోతున్నాం. అవును.. టాక్సీవాలా సినిమాలో సరికొత్త క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు దేవరకొండ. మరీ ముఖ్యంగా ఇదొక హారర్ సినిమా కావడం విశేషం.

అవును.. చాలామందికి తెలియని విషయం ఏంటంటే టాక్సీవాలా అనేది ఓ హారర్ థ్రిల్లర్ సినిమా. ఈ మూవీలో దేవరకొండ దెయ్యంతో సావాసం చేస్తుంటాడట. అది కూడా ఆడ దెయ్యం. అతడు నడిపే టాక్సీలోనే ఆ దెయ్యం కూడా ఉంటుందట. దేవరకొండకు, దెయ్యానికి, టాక్సీకి సంబంధం ఏంటనేదే టాక్సీవాలా కథ అట.

ఈ సినిమాకు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. ఇతడు గతంలో 'ది ఎండ్' అనే సినిమా తీశాడు. అది హారర్ థ్రిల్లర్ సినిమా. అదే జానర్ లో విజయ్ దేవరకొండను హీరోగా పెట్టి టాక్సీవాలా సినిమా చేశాడు. 

ఈ సినిమాలో కారులో ఆడ దెయ్యం ఉంటుందట. అందుకే మూవీకి 'షి'కారు (షి-అంటే ఇంగ్లిష్ లో ఆమె అని అర్థం) అనే టైటిల్ అనుకున్నారు. కానీ కాస్త మాస్ టచ్ ఉండాలనే ఉద్దేశంతో టాక్సీవాలా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రేపు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతోంది. అందులో టైటిల్ లోగోతో పాటు స్టోరీకి సంబంధించి ఏమైనా వివరాలు వెల్లడిస్తారేమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?