తేజ కు సెంటిమెంట్ టైటిల్

చిత్రం, జయం, ధైర్యం, నిజం ఇలాంటి టైటిళ్లు పెట్టిన తేజకు అప్పట్లో సున్న సెంటిమెంట్ గా వుండేది. ఇప్పుడు కొత్త సెంటిమెంట్ వచ్చింది. నేనే రాజు నేనే మంత్రి సినిమా హిట్ అయిన తరువాత…

చిత్రం, జయం, ధైర్యం, నిజం ఇలాంటి టైటిళ్లు పెట్టిన తేజకు అప్పట్లో సున్న సెంటిమెంట్ గా వుండేది. ఇప్పుడు కొత్త సెంటిమెంట్ వచ్చింది. నేనే రాజు నేనే మంత్రి సినిమా హిట్ అయిన తరువాత ఆ కోవలో టైటిళ్లు వెదుకుతున్నారు. సురేష్ బాబు, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ కలిసి వెంకటేష్ తో నిర్మించే సినిమాకు తేజనే దర్శకుడు. ఈ సినిమా ఈ నెలలో సెట్ మీదకు వెళ్తోంది.

ఈ సినిమా కోసం ఆట నాదే.. వేట నాదే.. అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. ప్రస్తుతానికి ఇదే టైటిల్ అనుకుంటున్నామని, ఇంకా మంచి టైటిల్ దొరికితే మారుస్తామని యూనిట్ వర్గాలు తెలిపాయి. వెంకీ సరసన కాజల్ ను హీరోయిన్ గా తీసుకోవడానికి డిస్కషన్లు స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.

జనాలు గమనించారో లేదో, నేనే రాజు నేనే మంత్రిలో తేజ తన మరో సెంటిమెంట్ కూడా ప్రదర్శించారు. అదే జయం సినిమాలో చూపించిన హనుమంతుడు వున్న కాషాయ జెండా. నేనే రాజు నేనే మంత్రిలో ఆ జెండా కూడా కొన్నిసార్లు కనిపిస్తుంది. మరి ఈ సినిమాలో కూడా ఆ సెంటిమెంట్ ఫాలో అవుతారేమో? చూడాలి.