Advertisement


Home > Movies - Movie Gossip
తేజ్.. సినిమా సమస్య అదేనా?

సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ సినిమా తేజ్.. ఐ లవ్యూ. బ్యానర్ పేరున్నదే. కానీ తేజ్ కు హిట్ వచ్చి చాలా అంటే చాలా కాలం అయింది. తేజ్ సినిమా అంటేనే బయ్యర్లు భయపడే పరిస్థితి వచ్చింది. మరోపక్క డైరక్టర్ కరుణాకరన్ ట్రాక్ రికార్డు కూడా అంతంత మాత్రమే. అందుకే నిర్మాత కేఎస్ రామారావు ఎంత ప్రయత్నించినా బిజినెస్ కాలేదని తెలుస్తోంది.

కేవలం ఓవర్ సీస్ మాత్రమే అమ్మగలిగారు. మిగిలిన ఏరియాలు బేరాలు కుదరడం లేదు. తేజు మీద పెట్టగలిగిన పెట్టుబడికి, నిర్మాత చెబుతున్న రేట్లకు మధ్య అమెరికాకు, అనకాపల్లికి వున్నంత దూరం వుంది. ఇలాంటి టైమ్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా చూసారు. బాగానే వుందని ఆయనకు నమ్మకం కుదిరింది. కేఎస్ రామారావును ఆదుకోవాలని కాస్త ఆలోచన కలిగింది. దీంతో బాహాటంగా ఆయనే కేఎస్ రామారావుకు ఓ సినిమా రామ్ చరణ్ చేస్తాడని ప్రకటించారు.

ఇప్పుడు బయ్యర్లకు కాస్త ధైర్యం వస్తుంది. తేజ్ సినిమాకు రిటర్న్ బుల్ అడ్వాన్స్ లు అయినా కాస్త వచ్చే అవకాశం వుంది. కానీ ఇవన్నీ జరగాలంటే కాస్త టైమ్ కావాలి. అందుకే ఈ నెలాఖరును విడుదల చేద్దాం అనుకున్న సినిమాను మరో వారం వెనక్కు తోస్తున్నారని వినికిడి.

ఇదిలా వుంటే కరుణాకరన్ ఈ సినిమాకు కాస్త బాగానే ఖర్చు చేయించినట్లు తెలుస్తోంది. మాంటేజ్ షాట్స్ అంటూ కాస్త ఎక్కువే తీసి, ఎడిటింగ్ టేబుల్ మీద పెట్టినట్లు తెలుస్తోంది. అప్పటికీ మొన్న ఫంక్షన్ లో కేఎస్ రామారావు పబ్లిక్ గా అననే అన్నారు. తనకు, డైరక్టర్ కు నిత్యం గొడవే అని. అదంతా ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లోనే అని తెలుస్తోంది.

చూడాలి మరి తేజ్ అదృష్టం ఎలా వుందో? పెట్టిన పెట్టుబడికి తగిన అమ్మకాలు, ఆపైన వసూళ్లు ఏ మేరకు వుంటాయో? ఇండస్ట్రీలో వినిపిస్తున్నదాని ప్రకారం తేజ్ ఐ లవ్యూ తొలిసగం, ఉల్లాసంగా ఉత్సాహంగా మాదిరిగా ఫన్, డార్లింగ్ లో మాదిరిగా ఎమోషన్ కలిసి వుందని తెలుస్తోంది.