తెలుగు సినిమాలో మైక్ టైసన్

ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ తెలుగు సినిమాలో కనిపించబోతున్నారు. ఈ మేరకు గతంలో వినిపించిన వార్తలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి.  Advertisement పూరి జగన్నాధ్ అందిస్తున్న లైగర్ సినిమాలో నటించేందుకు మైక్ టైసన్…

ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ తెలుగు సినిమాలో కనిపించబోతున్నారు. ఈ మేరకు గతంలో వినిపించిన వార్తలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. 

పూరి జగన్నాధ్ అందిస్తున్న లైగర్ సినిమాలో నటించేందుకు మైక్ టైసన్ ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఏడాదిన్నర క్రితమే పూరి టీమ్ మైక్ టైసన్ అప్రొచ్ అయింది. కానీ రెండు వైపులా వ్యవహారం ఓ కొలిక్కిరాలేదు. 

అయితే ఇప్పుడు దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.కానీ ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే గతంలో లైగర్ సినిమా క్లయిమాక్స్ షూట్ అమెరికాలో ప్లాన్ చేసారు. అందువల్ల మైక్ టైసన్ షూటింగ్ కు రావడం పెద్ద సమస్య కాదు.

కానీ ఇప్పుడు క్లయిమాక్స్ ఎక్కడ షూట్ చేస్తారు అన్నది ఇంకా క్లారిటీ లేదు. అందువల్ల టైసన్ ఇక్కడకు వస్తారా? లేక అమెరికాలోనో షూట్ చేస్తారా? అన్నది తెలియాల్సి వుంది.