శ్యామ్ సింఘరాయ్ పరిస్థితి ఏమంత బాగున్నట్లు కనిపించడం లేదు. ఆ మాటకు వస్తే హీరో నాని పరిస్థితినే కాస్త టెన్షన్ గా వున్నట్లే. జెర్సీ సినిమాకు ముందు దేవ్ దాస్, కృష్ణార్జున యుద్దం సినిమాలు రెండూ ఫ్లాప్.
జెర్సీ కి భయంకరమైన క్రిటికల్ అప్లాజ్ వచ్చింది కానీ ఆ రేంజ్ ఆర్థిక విజయం మాత్రం లభించలేదు. ఏదో దానికి దానికి సరిపోయింది అనిపించుకుంది. ఆ తరువాత మళ్లీ గ్యాంగ్ లీడర్ డిజాస్టర్. వి సినిమా ఓటిటికి వెళ్లి బతికిపోయింది.
ఇలాంటి నేపథ్యంలో పక్కా ఫాండవుల ఫ్యామిలీ స్టోరీగా ఓ మధ్యతరగతి పెద్ద కుటుంబంలో ఒకడు అన్న పాయింట్ తో తయారైన టక్ జగదీష్ చేస్తున్నారు. దాని తరువాత చేయాల్సిన శ్యామ్ సింఘ రాయ్ చేతులు మారింది.
ఈ సినిమా బడ్జెట్ దాదాపు నలభై కోట్లకు పైనే అని వినిపిస్తోంది. గ్యాంగ్ లీడర్ కూడా ఇలాగే నలభై కోట్ల పైగా బడ్జెట్ తో తయారైంది. శ్యామ్ సింఘ రాయ్ లో ముగ్గురు హీరోయిన్లు, హీరో డబుల్ పోజ్, భారీ ఫ్లాష్ బ్యాక్, కలకత్తా బ్యాక్ డ్రాప్ ఇలాంటివి అన్నీ వున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో టక్ జగదీష్ సినిమా కచ్చితంగా హిట్ అయి తీరాలి. లేదూ అంటే నాలుగు ఫ్లాపులు, ఓ యావరేజ్ హిట్ సినిమా నేపథ్యంలో మరో ఫ్లాపు అంటే ఇక శ్యామ్ సింఘ రాయ్ తట్టుకోవడం కష్టం అవుతుంది.
ఇప్పటికీ శ్యామ్ సింఘ రాయ్ సినిమా ఎందుకు చేతులు మారింది అన్నది క్లారిటీ లేదు. నాని నే నిర్మాత వెంకట్ బోయినపల్లికి ఎప్పటి నుంచో సినిమా చేయాల్సి వుండడంతో, ప్రాజెక్టు మార్చారని టాక్ వుంది.
కాదు అంత బడ్జెట్ కు వెనకడుగు వేసారని గ్యాసిప్ లు వచ్చాయి. మొత్తం మీద వీటన్నింటి మధ్య టక్ జగదీష్ హిట్ కావడం అన్నది కీలకంగా మారింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది.